డబుల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నా వదలని ఒమిక్రాన్: ఏపీ సహా మరో రాష్ట్రంలో: థర్డ్‌వేవ్‌ సంకేతమా?

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే అయిదు రాష్ట్రాల్లో ప్రవేశించింది. తాజాగా మరో రెండు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుదల బాట పట్టింది. ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌, ఢిల్లీలల్లో ఈ కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ, హర్యానా ఈ జాబితాలో చేరాయి.

హర్యానాలో తొలికేసు..

హర్యానాలో తొలికేసు..

హర్యానాలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసు నమోదైంది. ఇటలీ నుంచి 20 సంవత్సరాల యువకుడు ఈ ప్రమాదకరమైన వేరియంట్ బారిన పడ్డాడు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోన్న నేపథ్యంలో- ఇటలీ సహా యూరప్ దేశాలు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తోన్న పరిస్థితుల్లో కిందటి నెల 22వ తేదీన అతను స్వదేశానికి వచ్చాడు. ఇటలీ నుంచి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడి నుంచి చండీగఢ్‌కు చేరుకున్నాడు.

ఒమిక్రాన్ వేరియంట్‌గా..

ఒమిక్రాన్ వేరియంట్‌గా..

అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులకు గురయ్యాడు. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. కరోనా వైరస్ సోకినట్టు ఈ నెల 1వ తేదీన నిర్ధారించారు. అతని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు చండీగఢ్ వైద్యారోగ్య శాఖ అధికారులు. ఆయనకు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్‌గా తేలింది. ఆయన శాంపిళ్లను మరోసారి పరీక్షల కోసం పంపించామని, ఆ నివేదికలు ఈ సాయంత్రానికి అందుతాయని వైద్యాధికారులు పేర్కొన్నారు.

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..

కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన రెండు డోసుల వ్యాక్సిన్‌ను ఆ యువకుడు తీసుకున్నాడు. అమెరికా సహా పలు యూరప్ దేశాల్లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌లో వినియోగిస్తోన్న ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులను వేసుకున్నాడా యువకుడు. అయినప్పటికీ- అతను వైరస్ బారిన పడటం అధికారులకు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. చండీగఢ్‌లో అతను నివసిస్తోన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు.

మోస్ట్ డేంజరస్‌గా..

మోస్ట్ డేంజరస్‌గా..


ఇదివరకు కరోనా వైరస్‌కు సంబంధించిన ఒకట్రెండు వేరియంట్లు బయటపడ్డాయి. అవి పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. డెల్టా, డెల్టా వేరియంట్, ఇతర మ్యూటెంట్లు అదృష్టశావత్తూ కరోనా వైరస్ తీవ్రతను పెంచలేకపోయాయి. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేశాయి. దాన్ని నియంత్రించగలిగాయి. ఫలితంగా డెల్టా ప్లస్ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఈ వేరియంట్ల బారిన పడి మరణించిన వారి సంఖ్య పరిమితంగా నమోదైంది.

వేగంగా వ్యాప్తి చెందే లక్షణం..

వేగంగా వ్యాప్తి చెందే లక్షణం..

కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ మాత్రం అత్యంత ప్రమాదకరమైనదిగా తయారైంది. డెల్టా వేరియంట్ల కంటే మూడు నుంచి మూడున్నర రెట్లు తీవ్రతను కలిగి ఉంది. అంతే వేగంతో వ్యాప్తి చెందే లక్షణం దీనికి ఉంది. అందుకే- చాలా వేగంగా ఈ వేరియంట్ అనేక దేశాలకు వ్యాప్తి చెందింది. భారత్ సహా ఇప్పటిదాకా 60కిపైగా దేశాల్లో వ్యాప్తి చెందిందీ ఒమిక్రాన్ వేరియంట్. ఇది అక్కడితో ఆగేలా లేదు. రోజుకో కొత్త దేశంలో అడుగు పెడుతోంది.

పిల్లలపై ప్రభావం..

పిల్లలపై ప్రభావం..

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లలు, వ్యాక్సిన్ వేసుకోని వారిపై తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 18 సంవత్సరాల లోపు పిల్లలు, టీనేజర్లపై ఈ వేరియంట్ పంజా విసరడం ఖాయంగా కనిపిస్తోందని స్పష్టం చేసింది. మున్ముందు- దీని తీవ్రత మరింత పెరిగే పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయని, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోక తప్పదనీ సూచించింది. వైరస్ సోకిన 90 రోజుల తరువాత మళ్లీ దాడి లక్షణాలు దీనికి ఉన్నాయని, ఇది ఆందోళనకరమని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+