వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థర్డ్‌వేవ్ తప్పదు: భారత్‌లో జనవరి-ఫిబ్రవరి మధ్య పతాక స్థాయికి కరోనా తీవ్రత: ప్రొఫెసర్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ సహా ఇప్పటిదాకా 24 దేశాల్లో అడుగు పెట్టింది. ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన దేశాల సంఖ్య పెరుగుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అనేక దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్‌ కూడా దీనికి మినహాయింపు కాదు. బెంగళూరు, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో అయిదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ సహా..

భారత్ సహా..


దక్షిణాఫ్రికా, బోట్సువానాల్లో వెలుగులోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఒమిక్రాన్ వేరియంట్ ఇతర ఖండాలకు విస్తరించింది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, బెల్జియం, బోట్సువానా, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్ కేసులు నమోదయ్యాయి. ఇదే జాబితాలో భారత్‌ చేరింది. ఆయా దేశాలతో పోల్చుకుంటే.. భారత్‌లో నమోదైన కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. పెరిగే ప్రమాదం లేకపోలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

 థర్డ్‌వేవ్..

థర్డ్‌వేవ్..

దేశంలో కరోనా వైరస్ థర్డ్‌వేవ్ అలముకుందని, క్రమంగా ఇది విస్తరిస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగ్రవాల్ తెలిపారు. ప్రస్తుతం థర్డ్‌వేవ్ ప్రారంభదశలో ఉందని పేర్కొన్నారు. వచ్చే జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో దీని తీవ్రత పతాకస్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాంచల్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు.

ముందు జాగ్రత్తలతోనే

ముందు జాగ్రత్తలతోనే

థర్డ్‌వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని, భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని మణీంద్ర అగ్రవాల్ చెప్పారు. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి చర్యల వల్ల థర్డ్‌వేవ్ గండం నుంచి గట్టెక్కవచ్చని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలను పాటించడం వల్ల ఒమిక్రాన్ వేరియంట్ గండం నుంచి గట్టెక్క వచ్చని సూచించారు. ఈ వేరియంట్‌కు వ్యాప్తి చెందే లక్షణం అధికంగా ఉండటం వల్ల ప్రజలు కోవిడ్ 19 ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మణీంద్ర అగ్రవాల్ స్పష్టం చేశారు.

 వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించడం బెస్ట్..

వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించడం బెస్ట్..


కరోనా వైరస్ థర్డ్‌వేవ్ సంభవించడం ఖాయంగా కనిపిస్తోందని, దీన్ని ప్రభుత్వం ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటోందనే విషయం మీదే దాని వ్యాప్తి అనేది ఆధారపడి ఉందని చెప్పారు. కనీస జాగ్రత్తలను పాటించకపోతే ఇదివరకట్లా సెకెండ్ వేవ్ తరహా పరిణామాలను ఎదుర్కొనక తప్పదని మణీంద్ర అగ్రవాల్ హెచ్చరించారు. ఈ వేరియంట్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్ విధించడం, రాత్రి వేళ కర్ఫ్యూ విధించడం అత్యుత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.

Recommended Video

Omicron Variant : 3rd Omicron Case Detected In India || Oneindia Telugu
 ఢిల్లీలోనూ పాజిటివ్ కేసు..

ఢిల్లీలోనూ పాజిటివ్ కేసు..


దేశ రాజధానిలో తాజగా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు అయిదు కేసులు రికార్డయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన ఆఫ్రికాలోని టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. దీనితో- దేశంలో కేసుల సంఖ్య అయిదుకు పెరిగింది. టాంజానియా నుంచి వచ్చిన వెంటనే పరీక్షలు చేయగా..పాజిటివ్ రావటంతో లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటి వరకు పాజిటివ్‌గా గుర్తించిన 17 మంది ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

English summary
A mild third wave of Covid-19 is likely to peak in India between January and February next year, IIT Kanpur professor Manindra Agrawal claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X