జనతా కర్ఫ్యూ: ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో తెలుసా?.. కీలక సందేశం..
కొవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారిపై యుద్ధంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన ఈ స్వచ్ఛంద లాక్ డౌన్ 14 గంటలపాటు, అంటే, రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణలో మాత్రం 24 గంటలు బంద్ కు సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
స్వచ్ఛంద కర్ఫ్యూలో భాగంగా వైద్య సిబ్బంది, పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసులు, మీడియా వాళ్లు తప్ప దేశంలోని మిగతా జనమంతా తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. మహా నగరాలు మొదలుకొని మారుమూల గ్రామాల దాకా ప్రజలెవరూ రోడ్లపైకి రావడంలేదు. జనతా కర్ఫ్యూపై భారీ ఎత్తున ప్రచారం జరగడంతో దాదాపు అందరూ శనివారం నాటికే కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకున్నారు. అనుకోకుండా గ్యాస్ అయిపోవడమో, ఇంకేవో కారణాలతో ఇబ్బందులుపడ్డ కుటుంబాలకు.. పొరుగువాళ్లు సాయం చేసిన దృశ్యాలెన్నో వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా ఒక్క పిలుపుతో 134 కోట్ల మందిని కర్ఫ్యూ పాటించేలా చేసిన ప్రధాని మోదీ.. ఇవాళ ఎక్కడుండి, ఏం చేస్తున్నారంటే..

ప్రజలకు పిలుపిచ్చినట్లే.. ప్రధాని మోదీ తాను కూడా జనతా కర్ఫ్యూ రోజైన ఆదివారం.. 7, లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన అధికార నివాసానికే పరిమితమైపోయారు. కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న ఆయన.. ఫోన్ లోనే అత్యవసర ఆదేశాలు జారీచేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు సందేశాలిస్తూ, కర్ఫ్యూకు సంబంధించిన అప్ డేట్స్ ను, కర్ఫ్యూ పాటిస్తోన్న తన స్నేహితుల సందేశాలను షేర్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు, ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ వంతెన బోసిపోయి ఉండటం తదితర వీడియోలు, ఫొటోలను ప్రధాని షేర్ చేశారు. దాందోపాటు..
Can you see the link?
— Narendra Modi (@narendramodi) March 22, 2020
Looks like people have closed ranks to uproot the COVID-19 menace. #JantaCurfew https://t.co/Sk3zpolbdY
కరోనాపై పోరాటంలో భాగంగా ఆదివారం ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. కుటుంబాలతో క్వాలిటీ టైమ్ గుడుపుతూ, సరదాగా టీవీ చూస్తూ, చక్కటి భోజనం చేయండంటూ ఆయన సందేశమిచ్చారు. ''కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటానికి బలం చేకూర్చండి.. ఇవాళ మనం తీసుకున్న మొదటి దశ నిర్ణయం.. రాబోయే కాలంలో సహాయకారిగా ఉండబోతున్నది''అని మోదీ పేర్కొన్నారు. తొలి నిమిషం నుంచే కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టే కార్యక్రమం సందర్భంగా, రాత్రి 9 గంటలకు కర్ఫ్యూ ముగింపు వేళ ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశాలున్నాయి. ఇక..

మోదీ కేబినెట్ లో నంబర్ 2, 3గా పేరుపొందిన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ కూడా తాము ఇళ్లకే పరిమితమయ్యామని ప్రకటించారు. కరోనాపై పోరాటాన్ని కలిసికట్టుగా చేద్దామని పిలుపునిచ్చారు. 'ఇవాళ నేను ఇంట్లో నుంచే పనిచేస్తున్నా, ఎమర్జెన్సీ సేవలవాళ్లు తప్ప మిగతా వాళ్లంతా ఇళ్లలోనే ఉండండి. జనతా కర్ఫ్యూ కోసం ప్రధాని ఇచ్చిన పిలుపునకు బాసటగా నిలవండి' అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
The people of India have decided- we are in this together. We will fight the menace of COVID-19 together. #JantaCurfew https://t.co/A1KsBWKTNR
— Narendra Modi (@narendramodi) March 22, 2020
The streets are empty but the resolve to fight COVID-19 is full. #JantaCurfew https://t.co/9fTjpbhjal
— Narendra Modi (@narendramodi) March 22, 2020
Recommended Video
జనతా కర్ఫ్యూలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా పూర్తిగా బంద్ అయింది. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే సేవలు కూడా దాదాపు నిలిపేశారు. దేశవ్యాప్తంగా 2,400 ప్యాసింజర్, 1,300 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. పలు విమానయాన సంస్థలు కూడా సర్వీసుల్ని నిలిపేశాయి.












Click it and Unblock the Notifications