వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ బి ఐ షాక్ ,అప్పటికీ 4.95 లక్షల కోట్లు మాత్రమే, అందుకే ఐదువందల నోటు ముద్రణ

పెద్ద నగదు నోట్లను రద్దుచేసే సమయానికి ఆర్ బి ఐ వద్ద కేవలం 4.95 లక్షల కోట్ల కొత్త రెండువేల రూపాయాల కరెన్సీ మాత్రమే ఉంది. రద్దుచేసిన నగదు లో ఇది పావువంతుకు తక్కువ.దీనితో కరెన్సీ కష్టాలు ఎక్కువయ్యాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత దేశంలో ప్రజలు ఇబ్బంది పడడానికి కొత్త కరెన్సీ అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణంగా మారింది. పెద్ద నగదు నోట్లను రద్దుచేసే నాటికి ఆర్ బి ఐ వద్ద కేవలం 4.95 లక్షల కోట్ల కొత్త కరెన్సీ నోట్లు మాత్రమే ఉన్నాయి.దీని కారణంగానే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను పెద్ద నగదు నోట్లను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నవంబర్ 8వ, తేది రాత్రి ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం వల్ల నల్లధనాన్ని నిర్మూలించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

నల్లధనం నిర్మూలనలో పెద్ద నగదు నోట్లు కీకలంగా వ్యవహరిస్తున్నాయని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. అయితే పెద్ద నగదు నోట్లను రద్దు చేసేముందుగా ప్రజలకు కొత్త కరెన్సీని అందుబాటులోకి ఎంత మేరకు కరెన్సీని తీసుకురావచ్చనే విషయమై పూర్తిగా అంచనావేయలేకపోయింది.

కొత్తగా ముద్రించిన ఐదు వందల రూపాయాల కరెన్సీలో ముద్రణలోపాలున్నాయి. దీంతో ఈ కరెన్సీని తిరిగి వాపసు తీసుకొంది ఆర్ బి ఐ. కొత్తగా రెండువేల రూపాయాల కరెన్సీ మార్కెట్లోకి రావడంతో చిల్లర లేని కారణంగా ప్రజలు తీవ్రంగా కష్టాలు పడ్డారు.

ఆర్ బిఐ వద్ద 4.95 లక్షల కోట్లే

ఆర్ బిఐ వద్ద 4.95 లక్షల కోట్లే

పెద్ద నగదు నోట్లను రద్దు చేసే రోజున ఆర్ బి ఐ వద్ద కొత్త కరెన్సీ సుమారు 4.95 లక్షల కోట్లు ఉంది. అయితే రద్దు చేసిన నగదులో కొత్త కరెన్సీ నాలుగవ వంతు కంటే తక్కువగా ఉంది. దీని కారణంగానే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రద్దుచేసిన నగదులో సమానంగా కొత్త కరెన్సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ప్రజలు ఈ మేరకు ఇబ్బందులు పడేవారు కాదు. అయితే కొత్త కరెన్సీ రెండువేల రూపాయాల నగదు నోటును విడుదల చేశారు. ఈ నోటును చలామణిలోకి తెచ్చిన చిల్లర సమస్యతో ప్రజలు మరింత ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఆర్ టి ఐ కార్యకర్త కు ఆర్ బి ఐ సమాధానం

ఆర్ టి ఐ కార్యకర్త కు ఆర్ బి ఐ సమాధానం

నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దుచేసింది.అయితే రద్దు చేసిన నగదు స్థానంలో ఎంత మేరకు కొత్త నగదును అందుబాటులొకి వచ్చిందనే విషయమై ఆర్ బి ఐ అధికారులను ఆర్ టి ఐ కార్యకర్త అనిల్ గల్గలి ప్రశ్నలు అడిగారు. ఆయనకు ఆర్ బి ఐ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.పెద్ద నగదు నోట్లు రద్దుచేసే సమయానికి ఐదువందలు, వెయ్యి రూపాయల నగదు నోట్లు సుమారు 20.51 లక్షల కోట్లున్నాయని ఆర్ బి ఐ తెలిపింది. కొత్త కరెన్సీ రెండువేల రూాపాయాలు మాత్రమే 4.95 లక్షల కోట్లున్నాయని ఆయనకు ఆర్ బి ఐ వివరాలు ఇచ్చింది.

కొత్త ఐదువందల నోటు లేదు

కొత్త ఐదువందల నోటు లేదు

వెయ్యి ,ఐదు వందల రూపాయాల పెద్ద నగదు నోట్లను రద్దు చేశారు. అయితే వాటి స్థానంలో కొత్తగా రెండు వేల రూపాయాల నగదును మాత్రమే నవంబర్ 8వ, తేది నాటికి ముద్రించారు. పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన సమయంలో కొత్త ఐదువందల రూపాయాల నోటు ఒక్కటి కూడ లేదని ఆర్ బి ఐ ప్రకటించింది. కొత్త వెయ్యి రూపాయాల నోటు ముద్రించే విషయమై ఇంకా ఆర్ బి ఐ నిర్ణయం తీసుకోలేదు. చిల్లర సమస్య కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చిల్లర సమస్యతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి కొత్త ఐదువందల రూపాయాలను ముద్రించినట్టు ఆర్ బి ఐ ఆయనకు వివరించింది.

రద్దుచేసిన నగదు రూ.15.44 లక్షలుచలామణి

రద్దుచేసిన నగదు రూ.15.44 లక్షలుచలామణి

పెద్ద నగదు నోట్లను రద్దుచేసేనాటికి సుమారు 15.44 లక్షల కోట్ల ఐదువందలు, వెయ్యి రూపాయాల నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్ బి ఐ అంచనావేసింది. అయితే రద్దుచేసిన నగదు చలామణిలో ఉన్న మేరకు కొత్త కరెన్సీని విడుదల చేసినా కష్టాలు తప్నేవి. అయితే నవంబర్ 9వ, తేది నుండి నవంబర్ 19వ, తేది వరకు బ్యాంకులకు ఎంత నగదును సరఫరా చేసిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 8 (1)ని అనుసరించి ఈ వివరాలను గోప్యంగా ఉంచినట్టు ఆర్ బి ఐ స్పష్టం చేసింది.

English summary
before demonatasion rbi had around rs.4.95 lakh crore in the new two thousand notes. an estimated r.15.44 lakh crore was in circulation in the old rs.500 and rs1000 notes on november8.rbi reply for rti activist galgli in written.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X