వింత ఆచారం: దీపావళి సందర్భంగా...భక్తులపై నడిచిన ఆవులు..
దీపావళి పండుగ సందర్భంగా చాలా ప్రాంతాల్లో వింత వింత ఆచారాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు దీపావళి జరుపుకోకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో బాణాసంచాలు నిషేదించడం, మరొకచోట అయితే, ఏకంగా శ్మశాసనంలోనే దీపావళి వేడుకలు జరుపుకోవడం వంటి వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఇప్పడు తాజాగా దీపావళి సందర్భంగా మరో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. దీపావళి పండుగ మరుసటి రోజు ఓ గ్రామంలోని వారు ఓ ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే , ఈ ఆచారాన్ని వీరు ఎప్పటినుంచో పాటిస్తున్నారట. అదేంటంటే, నేలపై పడుకున్నభక్తులపై ఆవులను నడిపించారు ఇక్కడివారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి వారి నమ్మకం. ప్రస్తుతం ఈ వింత ఆచారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కోరిన కోర్కేలు తీరుతాయట : ఈ వింతైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఆచారం భిదావద్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నది. ఈ సంప్రదాయంలో భాగంగా దీపావళి మరునాడు అంటే సోమవారం ఆ ప్రాంతంలోని గ్రామస్థులంతా ఆవులను పూజిస్తారు. ఆ తర్వాత నేలపై బోర్లా పడుకున్న భక్తుల పైనుంచి ఆ ఆవులను నడిపిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఆవులలో ఉండే 33 కోట్ల దేవతల ఆశ్వీరాదాలు లభిస్తాయని ఇక్కడి వారికి ఓ బలమైన నమ్మకం. అందుకే వీరు ప్రతిఏటా ఇలాగే దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఐదురోజుల ఉపవాస దీక్షలు : అయితే, ఈ సంప్రదాయాన్ని ఆచరించే ముందు ఇక్కడివారు కొన్నింటిని పాటిస్తారు. ఈ పూజలు చేసేవారు ప్రత్యేకంగా దీపావళి సందర్భంగా ఐదు రోజులు ఉపవాసం చేస్తారు. దీపావళి ముందు రోజు గ్రామంలోని దేవాలయంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం దీపావళి రోజున ప్రత్యేక పూజలుంటాయి. ఆ తర్వాత రోజు డప్పులు మోగించుకుంటూ గ్రామస్థులంతా ఓ చోట సమావేశమవుతారు.
#WATCH | Devotees let cows trample them as a part of a tradition in village Bhidavad of Badnagar tehsil, Ujjain district in Madhya Pradesh
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 13, 2023
The ritual is performed on the next day of Diwali. Devotees believe that by doing this their wishes will come true. pic.twitter.com/evwikt8HJC
ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు నేలపై పడుకుంటారు. అప్పడు వారిపై నుంచి ఆవులను నడిపిస్తారు. ఇదే ఇక్కడి సంప్రదాయం. ఆవులు వెళ్లిపోయిన తర్వాత వారంతా లేస్తారు. అయితే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు సూదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటో మీరు చూసేయండి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications