వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి ముగ్గురిలో 36 శాతం మహిళలకు అవే ఫోన్ కాల్స్: రిపోర్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియాలోని ముగ్గురు మహిళలు లేదా 36 శాతం మహిళలు లైంగిక వేధింపుల ఫోన్ కాల్స్, లేదా ఎస్ఎంఎస్‌లతో ఇబ్బందులు పడుతున్నారని ట్రూ కాలర్స్ సర్వేలో తేలింది.

కనీసం ఒక్క వారంలోనే ఈ తరహ ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయని ఈ సర్వే తేటతెల్లం చేసిందని చెప్పారు.

One in 3 Indian women receive offensive calls, SMS: Truecaller survey

ట్రూ కాలర్ యాప్ సర్వే ప్రకారంగా 78 శాతం మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యే ఫోన్ కాల్స్ లేదా అశ్లీల సంభాషణలకు సంబంధించి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తేలింది. మరో వైపు 82 శాతం మహిళలకు అశ్లీల వీడియోలు, చిత్రాలను వారానికి ఒక్కసారైనా అందుకొంటున్నారని ఈ సర్వే తేట తెల్లం చేసింది.

కనీసం 50 శాతం మహిళలు అశ్లీల టెక్స్ట్ మేసేజ్‌లు, లేదా ఫోన్ కాల్స్‌ పొందుతున్నారని ఈ సర్వే తేట తెల్లం చేసింది. మరో వైపు 11 శాతం ఫోన్ కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్నారని, మూడు శాతం తెలిసినవారి నుండే వస్తున్నాయని తేలింది.

ఇండియాలో 18 శాతం మహిళలు అనవసరంగా ఫోన్ కాల్స్ పురుషుల కంటే ఎక్కువగా చేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఇది ఇంకా పెరిగింది. గత ఏడాది 13 శాతం ఉంటే, ఈ ఏడాది మరో 5 శాతం పెరిగిందని ఈ సర్వే తేటతెల్లం చేసింది.

ఈ తరహ పోన్ కాల్స్‌కు వ్యతిరేకంగా 62 శాతం మంది మహిళలు ఫిర్యాదులు చేశారు. ఈ తరహ నెంబర్లను సుమారు 65 శాతం మహిళలు బ్లాక్ చేశారు. 48 శాతం మహిళలు కాల్ బ్లాక్ యాప్‌ను ఏర్పాటు చేశారు.

ఫోన్‌లో వేధింపులు ఎదుర్కొన్న వారిలో 10 శాతం మహిళలు మాత్రమే పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రపంచంలో ఎక్కువగా ఇండియాలోనే ఈ తరహ స్పామ్ కాల్స్ వస్తున్నాయని ట్రూ కాల్స్ సర్వే తేట తెల్లం చేసింది.

వారానికి 72 శాతం మహిళలు తప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. మహిళల సమాచారాన్ని సేకరించడం, బ్యాంకుల సమాచారాన్ని సేకరిస్తున్నారని ఈ సర్వే తెలిపింది.

ఈ సర్వే ఈ ఏడాది జనవరి 20 నుండి ఫిబ్రవరి 22 మధ్య జరిగింది,. 2004 మంది 15 ఏళ్ళ 35 ఏళ్ళ మహిళల నుండి సేకరించారు. దేశంలోని సుమారు 15 పట్టణాల్లోని మహిళల నుండి సర్వే చేశారు.

English summary
One in every three or 36 per cent of women in India receive sexual and inappropriate calls or SMS' at least once a week, a survey has found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X