వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ అభ్యర్థి మావాడు ,కాదు మా వాడు !

|
Google Oneindia TeluguNews

ఎన్నికల వేళ ,పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దీంతో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు చర్చల మీద చర్చలు జరుపుతారు. అందులో కాస్త చరిష్మా ఉన్న నాయకులైతే పార్టీలు మరి వెంటపడి వారిని ఆహ్వానిస్తాయి.ఈ నేపథ్యంలోనే యూపిలో మాత్రం ఓవైపు కాంగ్రెస్ మరోవైపు పీఎస్‌పీలు ఓక్కరినే తమ అభ్యర్థిగా ప్రకటించాయి.

యూపి మహరాజ్ గంజ్ లో ఒకే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ , ప్రగతి శీల్ పార్టీలు

యూపి మహరాజ్ గంజ్ లో ఒకే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ , ప్రగతి శీల్ పార్టీలు


ఎన్నికల వేళ అభ్యర్థులు పార్టీలు మారడం ,వారికి పార్టీలు కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకోవడం పరిపాటిగా మారతోంది.నిన్నటి వరకు ఒక పార్టీలో నేడు మరోక పార్టీలో ఉన్నవారు దేశశ్యాప్తంగా కోకోల్లలు ఉన్నారు, ఎన్నికల్లో కొత్త నేతలు సైతం పార్టీల్లో చేరి టికెట్ సంపాదించుకుంటున్నారు అయితే యూపి లోక్ సభ ఎన్నికల్లో మాత్రం వింత సంఘటన జరిగింది.అది ఒక జాతియ పార్టీ కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీ పీఎస్‌పీ ల మధ్య కొనాసాగింది.

ప్రియాంక గాంధి మనసును దోచుకున్న త్రిపాఠి

ప్రియాంక గాంధి మనసును దోచుకున్న త్రిపాఠి

కాంగ్రెస్ పార్టీ యూపి మాజి మంత్రి,కుమార్తే అయిన 27 సంవత్సరాల తనూశ్రీ త్రిపాఠి ని మహరాజ్ గంజ్ లోక్ స్థానం నుండి తమ అభ్యర్థిగా ప్రకటించింది.అయితే ఇదే తనుశ్రీ త్రిపాఠిని గత వారం క్రితమే సమాజ్ వాది పార్టీ నుండి విడిపోయి ప్రగతి శీల్ పార్టీ ని ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్ ఆమే పేరును ప్రకటించారు. తనుశ్రీ స్థానిక సమస్యలపై స్పందించి పలు నివేదికలను విడుదల చేసింది.దీంతో వీటికి అకర్షితురాలైన యూపి ఎన్నికల ఇంచార్జి అయిన ప్రియాంక గాంధి ఆమేను అభ్యర్థిగా ప్రకటించడానకి అవకాశాలు ఏర్పాడ్డాయి.

కాంగ్రెస్ అభ్యర్థిగా టీవీ యాంకర్ గా

కాంగ్రెస్ అభ్యర్థిగా టీవీ యాంకర్ గా

ఈనేధ్యంలోనే తన తప్పును తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ హైకమండ్ వెంటనే మరో అభ్యర్థిని ప్రకటించింది ,ఈ నేపథ్యంలోనే ఎకనమిక్ టైమ్స్ టీవీ యాంకర్ గా పని చేసిన సుప్రియ శ్రీనటే ను తిరిగి తమ అభ్యర్థిగా ప్రకటించింది.

జైలు పాలైన అభ్యర్థి తల్లి దండ్రులు

జైలు పాలైన అభ్యర్థి తల్లి దండ్రులు

అయితే మహరాజ్ గంజ్ లోక్ సభ స్థానం నుండి పోటి చేస్తున్న తను శ్రీ త్రిపాఠి యూపి మాజీ మినిస్టర్ అయిన అమర్నాధ్ త్రిపాఠి కూతురు అయితే అమర్నాథ్ త్రిపాఠి అటు మాయవతి ప్రభుత్వంలోను ఇటు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వంలోను మంత్రి గా పనిచేశారు. అయితే మధుమితా శుక్లా అనే ఓ కవయిత్రి హత్య కేసులో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కోన్న ఆయన తో ఆయన భార్య కూడ జీవిత ఖైదు పడి శిక్షను అనుభవిస్తున్నారు.

English summary
As parties announce their candidates for the April-May national election, a curious case emerged in Uttar Pradesh when a candidate was named by two parties in the same constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X