కాశ్మీర్: రాళ్లు రువ్విన వేర్పాటువాదులు, కాల్పుల్లో ఒకరు మృతి
శ్రీనగర్: వేర్పాటువాద నేత మసరత్ ఆలం అరెస్టుకు నిరసనగా జరుగుతున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బద్గాం జిల్లా నర్బాల్‌లో శనివారం జరిగిన పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
పలు వాహనాలు నిప్పుపెట్టిన అందోళనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వటంతో కాల్పులు జరిపినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. కాగా పాకిస్థాన్ జెండాను ప్రదర్శించి, పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన ఆరోపణలపై వేర్పాటువాద నాయకుడు మసరత్ అలంను శుక్రవారం అరెస్టు చేశారు.

దీంతో గిలానీ.. మసరత్ ఆలం అరెస్టుకు నిరసనగా శనివారం బంద్ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం విద్యాసంస్థలు, దుకాణ సముదాయాలు మూతబడ్డాయి.
పలువురు వేర్పాటువాదులు రోడ్లపైకి వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఆందోళనలు చేపట్టారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. వేర్పాటువాదుల కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.












Click it and Unblock the Notifications