దర్గాకు నోటీసులు, ఒకరి హత్య, డీసీపీతో సహ పోలీసులకు గాయాలు, గుజరాత్ ఎఫెక్ట్ !
అహమ్మదాబాద్/గుజరాత్: అధికారులు, ఓ వర్గం వారి మధ్య వాగ్వివాదం జరిగి గొడవలు మొదలైనాయి. ఈ గొడవల్లో ఓ వ్యక్తి చనిపోగా ముగ్గురు పోలీసులకు తీవ్రగాయాలైనాయి. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో శుక్రవారం మునిసిపల్ శాఖ అధికారుల బృందం అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ దర్గా కూల్చివేతకు నోటీసును అందజేయడంతో పెద్ద ఘర్షణ చెలరేగడంతో ఒకరు మరణించారు.
దర్గా అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ సంబంధిత అధికారులు దర్గా నిర్వహకులకు నోటీసులు అందించారు. శుక్రవారం రాత్రి దుర్గా చుట్టూ సుమారు 300 మంది గుమికూడారు. ఆ సందర్బంలో కొందరు వ్యక్తులు రెచ్చగొట్టడంతో అదే వర్గానికి చెందిన వారు అక్కడ భద్రతా ఏర్పాట్లలో ఉన్న పోలీసుల మీద రాళ్ల వర్షం కురిపించారు.

ఆందోళనకారులకు నచ్చ చెప్పడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసుల మీద దాడులకు పాల్పడి పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. పోలీసుల మీద దాడులు చేసి పోలీసు వాహనాలకు నిప్పంటిస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆందోళనకారుల దాడుల్లో ఓ డీసీపీతో పాటు ముగ్గురు పోలీసులకు తీవ్రగాయాలైనాయి, వెంటనే గాయపడిన పోలీసులను ఆసుపత్రులకు తరలించారు.
పరిస్థితి చెయ్యిదాటడంతో పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించి ఆందోళనకారులను చెదరకొట్టడానికి ప్రయత్నించారు. పోలీసుల మీద దాడలు చేసి పోలీసు వాహనాలకు నిప్పుపెట్టిన తరువాత పోలీసులు సుమారు 174 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా చూడటానికి పోలీసు అధికారులు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

చట్టవిరుద్దంగా ఓ వర్గం వాళ్లు దర్గాను నిర్మించారని ఆరోపిస్తూ జునాగడ్ మునిసిపల్ అధికారులు దర్గా నిర్వహకులకు నోటీసులు జారీ చెయ్యడంతో ఈ గొడవలు మొదలైనాయని స్థానిక మీడియా తెలిపింది. దర్గాను చట్టభద్దంగా నిర్మించలేదని, అందుకే ఆ దర్గాను కూల్చి వేస్తామని మునిసిపల్ శాఖ అధికారులు ఆ దర్గా నిర్వహకులను నోటీసులు అందించారు.
దర్గాను మీరు చట్టబద్దంగా నిర్మించి ఉంటే ఐదు రోజుల్లోపు సంబంధిత పత్రాలు సమర్పించాలని మునిసిపల్ శాఖ అధికారులు దర్గా నిర్వహకులకు సూచించారు.అయితే దర్గా దగ్గర రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసుల మీద వందలాది మంది ఒకేసారి రాళ్ల దాడికి దిగారు. ఈ ఆందోళనలో పోలీసులు గాయపడ్డారు. మామీద దాడులు చేసిన తరువాత పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించి 174 మందిని అదుపులోకి తీసుకున్నామని జునాగడ్ పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications