వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, ఉచిత వాషింగ్‌మెషిన్లు, రుణ మాఫీ అంటూ అన్నాడీఎంకే 164 కీలక హామీలు

|
Google Oneindia TeluguNews

అమ్మ లేకుండా అన్నాడీఎంకే ఎదుర్కొంటోన్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. దివంగత జయలలిత తరహాలోనే ఈసారి కూడా భారీ ఎత్తున హామీలను ప్రకటించిందా పార్టీ. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ఆదివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 164 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంలు సయుక్తంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఎప్పటిలానే ఉచితాలకు పెద్దపీట వేశారు. ఉచిత వాషింగ్‌ మెషిన్లు, కేబుల్‌ టీవీ వంటివి ఇందులో ఉన్నాయి. అదే సయమంలో ఇంటింటికీ ప్రభుత్వ ఉద్యోగం, రైతులకు రుణాల మాఫీ లాంటి కీలక హామీలూ ఉన్నాయి.

వైసీపీ గెలుపుపై సీఎం జగన్ కీలక కామెంట్లు -ఆ ఇద్దరికే క్రెడిట్ -3రాజధానులకు అనుకూలమన్న సాయిరెడ్డివైసీపీ గెలుపుపై సీఎం జగన్ కీలక కామెంట్లు -ఆ ఇద్దరికే క్రెడిట్ -3రాజధానులకు అనుకూలమన్న సాయిరెడ్డి

one-govt-job-for-each-family-free-lpg-loan-waiver-among-key-promises-in-aiadmk-manifesto

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఉచిత వాషింగ్‌మెషిన్లు, ఉచిత సోలార్‌ స్టవ్‌లు, అందరికీ ఉచిత కేబుల్‌ టీవీ సౌకర్యం కల్పిస్తామని అన్నాడీఎంకే తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. రేషన్‌ సరకులను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని, ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామని పేర్కొంది. అమ్మ హౌసింగ్‌ పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది. ఏటా పొంగల్‌కు ఇచ్చే రూ.2,500 నగదు పథకం కొనసాగుతుందని స్పష్టంచేసింది.

మహిళలకు సిటీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని, ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 దినాలకు పెంచుతామని పేర్కొంది. ఆటో రిక్షాలు కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.25వేలు సబ్సిడీ, కాలేజీ విద్యార్థులకు ఉచిత 2జీబీ డేటా అందిస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచింది. శ్రీలంక తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం, విద్యారుణాల రద్దు, మద్యం దుకాణాల తగ్గింపు వంటివీ ఇందులో ఉన్నాయి.

జగన్ దెబ్బకు ఓవైసీకి భారీ లాస్ -హిందూపూర్‌లో బోణీతో సరి -చంద్రబాబుకు ఎంఐఎం రిటర్న్ గిఫ్ట్!జగన్ దెబ్బకు ఓవైసీకి భారీ లాస్ -హిందూపూర్‌లో బోణీతో సరి -చంద్రబాబుకు ఎంఐఎం రిటర్న్ గిఫ్ట్!

English summary
Ahead of the upcoming Tamil Nadu elections, the All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) on Sunday released its election manifesto in which it promises at least one government job to every family in the state. The key promises made by the party in its manifesto include 'Amma' homes for all, six free LPG cylinders per year for every family and at least one government job per household.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X