'కూలీ' సినిమా స్ఫూర్తి: నిజ జీవిత హీరోలకు 'వన్ ఇండియా' అపూర్వ గౌరవం

వెండి తెరపై కనిపించే హీరోలకు, నిజజీవితంలో కష్టపడే కూలీలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి "వన్ ఇండియా(One India)" ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 'కూలీ' సినిమాను చూసేందుకు చెన్నై హార్బర్ నుంచి 100 మంది నిజమైన కూలీలను, 50 మంది పాఠకులను ఆహ్వానించింది.

'చెన్నై హార్బర్ నుంచి వెండితెర వరకు' పేరుతో 'వన్ ఇండియా' ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా సినిమాలోని స్ఫూర్తిని నిజ జీవితంలో ప్రతిబింబించేలా రోజూ కష్టపడే హార్బర్ కూలీలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారితో పాటు ఒక పోటీ ద్వారా ఎంపికైన 50 మంది పాఠకులు కూడా ఈ స్క్రీనింగ్‌లో పాలుపంచుకున్నారు. ఇది ఒక సినిమా ప్రదర్శనను మించి గౌరవం, ఆనందం, గుర్తింపుతో కూడిన ఒక ప్రత్యేక క్షణంగా నిలిచిపోయింది.

One India Honors Real-Life Heroes Chennai Harbour Workers Watch Coolie Movie

ఈ కార్యక్రమం గురించి 'వన్ ఇండియా' సీఈఓ ఎన్.రావణన్ మాట్లాడుతూ.. "వన్ ఇండియా మేము కథల శక్తిని నమ్ముతాము. అవి తెరపై చెప్పే కథలు మాత్రమే కాదు, ప్రతి రోజూ నిశ్శబ్ధంగా జీవించే కథలు కూడా. చెన్నై హార్బర్ కూలీలను, మా పాఠకులను 'కూలీ' సినిమా స్క్రీనింగ్‌కు తీసుకురావడం ద్వారా తెరవెనుక ఉన్న నిజమైన హీరోలను మేము గుర్తించాలనుకున్నాం. ఇది నిజ జీవిత పోరాటాలను, నిజమైన భారత్‌ను గౌరవించే మార్గం ఇది." అని వెల్లడించారు.

One India Honors Real-Life Heroes Chennai Harbour Workers Watch Coolie Movie

'కూలీ' సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్‌లో చప్పట్లు మాత్రమే కాదు, హార్బర్ కూలీల హృదయపూర్వక స్పందనలు కూడా వినిపించాయి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు వారు చప్పట్లు కొడుతూ.. కొన్నిసార్లు మౌనంగా తమ అనుభూతులను పంచుకున్నారు. ఈ ప్రత్యేక ప్రదర్శన, సినిమాకు, నిజ జీవిత హీరోలకు మధ్య ఉన్న బలమైన భావోద్వేగ సంబంధాన్ని వెల్లడించింది.

ఈ ప్రత్యేకమైన చొరవ ద్వారా 'వన్ ఇండియా' వినోదానికి, సామాజిక స్పృహకు, కథనానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. కేవలం ప్రచారం కోసం కాకుండా, ఒక సినిమా విడుదల ఎలా ఒక ప్రత్యేకమైన కథగా మారుతుందో ఈ కార్యక్రమం నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+