ఏంటది?: మోడీ కీలక ప్రతిపాదనకు ప్రణబ్ మద్దతు
న్యూఢీల్లీ: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రతీపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మద్ధతు లభించింది. దీనిపై ప్రవర్తనా నియమావళిలో మార్పులు, చేర్పుల అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించాలని రాష్ట్రపతి అన్నారు.

మోడీ-ప్రణబ్
ప్రధాని పిలుపునకు కొద్దికాలం క్రితమే ఎన్నికల కమిషన్ సానుకూలత తెలిపింది. అలాగే దేశంలోని ప్రధాన పార్టీలు కూడా మోడీ ఫార్ములాకు గతంలోనే సుముఖంగా స్పందించాయి. తాజాగా రాష్ట్రపతి మద్ధతు కూడా లభించడంతో ప్రధాని ప్రతిపాదన త్వరలోనే ఆచరణకు నోచుకునే అవకాశం కనిపిస్తోంది.

మోడీ-ప్రణబ్
వాస్తవానికి దేశంలో ఎప్పుడు చూసినా ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.

మోడీ-ప్రణబ్
దీనికి తోడు ఎన్నికలే పరమావధిగా నేతలు రాజకీయం చేస్తుడటంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నికల ఖర్చు కూడా భారీ స్థాయిలో ఉంటోంది.

మోడీ-ప్రణబ్
ఈ తరుణంలో ప్రధాని మోడీ ప్రతిపాదనకు రాష్ట్రపతి మద్ధతు కూడా లభించడంతో దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ , స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications