వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21ఏళ్ల క్రితం కొన్న చీరే!.. మళ్లీ కొనలేదు: ఇన్ఫోసిస్ సుధామూర్తి గురించి తెలియని విషయాలు!

అలా 21సంవత్సరాల క్రితం కాశీకి వెళ్లకముందు కొన్న చీరే.. ఆమె చివరిసారిగా కొనుగోలు చేసినది.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కాశీకి వెళ్లినవారు గంగా నదిలో ఏదో ఒక వస్తువును వదిలిరావడం ఆనవాయితీ. అలా చేస్తే మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆమె వస్తువుకు బదులు ఒక కోరికను త్యజించారు.

మాల్స్‌కు వెళ్లి చీరలు కొనుగోలు చేసే యాక్టివిటీకి ఫుల్ స్టాప్ పెట్టారు. అలా 21సంవత్సరాల క్రితం కాశీకి వెళ్లకముందు కొన్న చీరే.. ఆమె చివరిసారిగా కొనుగోలు చేసినది. ఇప్పటికీ ఆమె మళ్లీ కొత్త చీర కొనుగోలు చేయలేదు. దేశంలోని సంపన్న మహిళల్లో ఒకరైన సుధామూర్తి.. 21ఏళ్లుగా కొత్త చీర కొనలేదంటే అందరికీ ఆశ్చర్యమే కదా!

పీటీఐతో సుధామూర్తి:

పీటీఐతో సుధామూర్తి:

పీటీఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)తో మాట్లాడుతూ ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అత్యవసరాల కోసం తప్ప తాను షాపింగ్ చేయనని చెప్పారు. అయితే పుస్తకాల విషయంలో మాత్రం అలా ఉండదని, వెనకా ముందు చూడకుండా బోలెడు పుస్తకాలు కొనుగోలు చేస్తుంటామని అన్నారు. ఇప్పటికీ తమ ఇంట్లో 20వేల పుస్తకాల పైనే ఉన్నాయన్నారు.

త్రీ థౌజండ్ స్టిచెస్

త్రీ థౌజండ్ స్టిచెస్

ఎవరైనా పుస్తకం కావాలని అడిగితే మరో మాట లేకుండా తిరస్కరిస్తామని చెప్పారు. అలా అడిగే బదులు.. మార్కెట్లో ఒక కాపీ కొనుగోలు చేస్తే.. రచయిత కూడా ఆర్థికంగా బాగుంటాడు కదా అని పేర్కొన్నారు. ఇటీవలే 'త్రీ థౌజండ్ స్టిచెస్' అనే పుస్తకాన్ని సుధామూర్తి వెలువరించారు. కర్ణాటకలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 60వేల గ్రంథాలయాల్లో ఆ పుస్తకం కొలువుదీరింది.

తొలి ఫండింగ్ సుధామూర్తి నుంచే:

తొలి ఫండింగ్ సుధామూర్తి నుంచే:

కాగా, చాలామందికి తెలియని విషయమేంటంటే.. 1981లో ఇన్ఫోసిస్ అనే కంపెనీ ప్రారంభించాలని అనుకున్నప్పుడు.. మొట్టమొదట ఫండ్ రూ.10వేలు సుధామూర్తి ఇచ్చినదే. ఆమె తన సేవింగ్స్ లో నుంచి ఆ డబ్బును భర్త కోసం ఇచ్చారు.
'ఆ సమయంలో ఆయనతో నేనేం చెప్పానంటే.. ఆ మూడేళ్లు బ్రెడ్ సంగతి చూడండి, ఆ తర్వాత ఒకవేళ మీరు గనుక కారు, ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొంటే.. అదే నాకు అల్టీమేట్' అని చెప్పినట్లు సుధామూర్తి పేర్కొన్నారు.

దూరమైన స్నేహితులు:

దూరమైన స్నేహితులు:

ఇక ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసిందే. ఫోర్బ్స్ జాబితాలోను చోటు దక్కించుకుని మూర్తి దంపతులు బిలియనీర్లుగా అవతరించారు. అయితే ఆర్థికంగా ఎదగడం కూడా చాలామంది స్నేహితులను తనకు దూరం చేసిందంటున్నారు సుధామూర్తి. 'నా స్నేహితులు నన్ను కలవడానికి వచ్చినప్పుడు.. మైండ్ లో ఏదో పెట్టుకుని వచ్చేవారు. కచ్చితంగా అది డబ్బుకు సంబంధించిన విషయమే అయి ఉండేది' అలా చాలామంది స్నేహితులు దూరమయ్యారని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో స్వచ్చంద కార్యక్రమాల కోసం సుధామూర్తి చాలానే డబ్బు వెచ్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2300ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. గుజరాత్ భూకంప బాధితులను ఆదుకున్నారు.

English summary
It is only natural for the rich to take pride in the designer wears they don and flaunt. But not Sudha Murthy! One of India’s richest women, the chairman of the Infosys Foundation decided to give up on shopping instead. The last saree she bought was 21 years ago
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X