వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వంకు రూట్ క్లియర్: నేడు గవర్నర్ ఆహ్వానం !

తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పదవిని కాపాడుకోవడానికి దాదాపు అన్ని రూట్లు క్లియర్ అయిపోతున్నాయి. తన పదవికి ఎసరు పెట్టిన శశికళలకు జైలు శిక్షపడటంతో ఇప్పుడు ఎలాంటి చింత లేకుండా గవర్నర్ .

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పదవిని కాపాడుకోవడానికి దాదాపు అన్ని రూట్లు క్లియర్ అయిపోతున్నాయి. తన పదవికి ఎసరు పెట్టి ఎమ్మెల్యేలను రిసార్ట్ లో నిర్బంధించారని ఇన్ని రోజులు ఆరోపిస్తూ వస్తున్న పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గీయులు మంగళవారం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు గవర్నర్ ఆహ్వానం కోసం పన్నీర్ వర్గీయులు ఎదురు చూస్తున్నారు.

గవర్నర్ ఆదేశం:హై అలర్ట్, ఆంధ్రా బార్డర్ క్లోజ్, తమిళనాడులో ఏం జరుగుతోంది!గవర్నర్ ఆదేశం:హై అలర్ట్, ఆంధ్రా బార్డర్ క్లోజ్, తమిళనాడులో ఏం జరుగుతోంది!

తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు చెన్నై నగరంతో సహ తమిళనాడులో సంబరాలు చేసుకుంటున్నారు. పదవి మీద వ్యామోహంతో తమిళనాడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలని ప్రయత్నించిన శశికళకు దేవుడు సరైన శిక్ష విధించాడని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు.

One more AIADMK MLA joins Tamil Nadu CM Panneerselvam camp

తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న పన్నీర్ సెల్వం ఇప్పుడు తనకు మద్దతుగా ఎమ్మెల్యేలను కూడకట్టుకోవడంలో తలమునకలైనారు. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు శశికళను దోషిగా ప్రకటించడంతో ఆమె వర్గీయులు షాక్ కు గురైనారు.

జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్

ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ పన్నీర్ సెల్వం గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు. శశికళకు జైలు శిక్ష పడటంతో మన్నార్ గుడి ఫ్యామిలి ఉలిక్కిపడింది. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ వేస్తారని ముందుగా సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

శశికళ నిందితురాలు అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన వెంటనే అన్నాడీఎంకే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం గూటికి చేరిపోయారు. మరో అర్దగంటలో మరింతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం క్యాంప్ లో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారని అన్నాడీఎంకే నాయకులు తెలిపారు.

English summary
One more MLA joins Panneerselvam camp, just half an hour before the likely Supreme Court verdict in a DA case against Sasikala. Now, nine MLAs are backing OPS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X