కేరళ కాలామస్సేరిలో పేలుళ్లు, భీతావాహం - టిఫిన్ బాక్స్ బాంబు..!!

కేరళలోని కాలామస్సేరిలో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు ఒకరు మృతిచెందగా, 23 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం కాలామస్సేరి నెస్ట్‌ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 9.30 గంటల సమయంలో కన్వెన్షన్‌ హాల్‌ మధ్యలో ఒక్కరిగా భారీ పేలుడు జరిగింది.

వరుస పేలుళ్లతో కలకలం: ఎర్నాకుళం కాలామసేరిలో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. యెవోహా ప్రార్థనా మందిరంలో 2000 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఉదయం 9.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

One person died, and several injured in an explosion in Kalamassery, A tiffin box bomb has been suspected

పేలుడులో గాయపడ్డ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొద్ది క్షణాల తేడాతో వరుస పేలుళ్లు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హాలులో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. అయితే, టిఫిన్ బాంబు గా ఈ పేలుళ్లకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

టిఫిన్ బాక్స్ బాంబుగా అనుమానం: కాగా, ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. పేలుళ్లకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ముగ్గురు ఉన్నతాధికారులు ప్రస్తుతం ఎర్నాకుళంలోనే ఉన్నారని, డీజీపీ కూడా ఘటనా స్థలానికి బయల్దేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేరళ సీఎంకు ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీసారు. కేంద్ర టీంలు రంగంలోకి దిగుతున్నట్లు వెల్లడించారు.

సంఘటనా స్థలానికి అధికార యంత్రాంగం, బాంబ్‌ స్క్వాడ్‌ చేరుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ బ్లాస్ట్‌ ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.

రంగంలోకి కేంద్ర టీంలు: ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాద కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఘటనకు మూలాలు గుర్తించేందుకు ఎన్ఎస్జీ టీంలతో పాటుగా కేంద్ర విచారణ సంస్థలు కేరళకు చేరాయి. పాలస్తీనా యుద్దం కారణంగా కేరళలో పలుచోట్లు ముస్లిం సంస్థలు నిరసనలు చేపట్టాయి.

ఇదే సమయంలో క్రిస్టియన్‌ ప్రార్థనా స్థలంలో పేలుడు జరగడం సంచలనం రేపింది. ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని.. పేలుడు సంభవించడంతో అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. గాయపడ్డవారికి వైద్య సహాయం అందుతుందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+