చైనా తగ్గితేనే సరిహద్దు వివాదానికి పరిష్కారం: తేల్చేసిన భారత్, ప్యాంగ్యాంగ్ లేక్‌పై డ్రాగన్ కన్ను

న్యూఢిల్లీ: సరిహద్దులో శాంతి నెలకొనాలంటే చైనా దుందుడుకు వైఖరిని మానుకోవాలని భారత్ స్పష్టం చేసింది. సరిహద్దులో చైనా కొత్త నిర్మాణాలను ఆపినప్పుడే బలగాలను ఉపసంహరించుకోవడం జరుగుతుందని, సమస్యకు పరిష్కారం లభిస్తుందని చైనాకు భారత రాయబారి విక్రమ్ మిస్రీ తేల్చి చెప్పారు.

చైనా వెనక్కి తగ్గితేనే..

చైనా వెనక్కి తగ్గితేనే..

వాస్తవాధీన రేఖకులోపలి భాగం అంటే భారత భూభాగంలోనే భారత్ నిర్మాణాలు చేపడుతోందని.. అయితే, చైనా మాత్రం భారత భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాధీన రేఖ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లాలని, అక్కడ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని మిస్త్రీ స్పష్టం చేశారు. అప్పుడే సరిహద్దులో శాంతి నెలకొంటుందని తేల్చి చెప్పారు. భారత బలగాల గాల్వన్ లోయ ఘర్షణలకు కారణమయ్యారంటూ న్యూఢిల్లీలోని చైనా రాయబారి గురువారం ఆరోపించిన నేపథ్యంలో విక్రమ్ మిస్త్రీ శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. సరిహద్దులో శాంతి పరిస్థితులను నెలకొల్పేందుకు ఇరుపక్షాలవారు ప్రయత్నించాలని సూచించారు.

సరిహద్దులో 3500 కిలోమీటర్ల ఇరుదేశాల బలగాలు..

సరిహద్దులో 3500 కిలోమీటర్ల ఇరుదేశాల బలగాలు..

కాగా, మే నెల నుంచే సరిహద్దులో చైనా బలగాలు మోహరిస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా భద్రతా దళాలను సరిహద్దులో మోహరించిందని తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి సుమారు 3500 కిలోమీటర్ల వరకు చైనా బలగాలు మోహరించడంతో భారత రక్షణ దళాలు కూడా పెద్ద ఎత్తున సరిహద్దుల వెంట కదిలాయి.

ప్యాంగ్‌లేక్ పై చైనా కన్ను.. శాటిలైట్ చిత్రాల్లో..

ప్యాంగ్‌లేక్ పై చైనా కన్ను.. శాటిలైట్ చిత్రాల్లో..

ఇది ఇలావుండగా, ఓ వైపు చర్చలంటూనే చైనా కుట్రలకు తెగబడుతోంది. సరిహద్దుల వెంబడి భారీగా బలగాలను, ఆయుధాలను చేరవేస్తోంది. ప్యాంగ్యాంగ్ సరస్సును ఆక్రమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. సరస్సు సమీపంలో భారీ వాహనాలు, టెంట్లు, పడవలు ఏర్పాటు చేసుకున్నట్లు ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

Recommended Video

    Bhutan కూడా India పై కయ్యానికి దిగితే? 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నదీ జలాల అడ్డగింత ఎవరి పని ?
    అయినా చైనాకు బుద్ధిరాలే..

    అయినా చైనాకు బుద్ధిరాలే..

    జూన్ 15న గాల్వన్ లోయలో చైనా దళాలు దొంగదారిన దాడి చేసి 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, భారత్ జరిపిన ఎదురుదాడిలో సుమారు 45 మందికిపైగా చైనా దళాలు హతమయ్యాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. భారత దళాలు భీకరంగా ఎదురుదాడి దిగడంతో చైనా బలగాలు భయంతో పరుగులు తీశాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయినా, చైనా వక్రబుద్ధిని మార్చుకోకుండా బలగాలను పెంచుతూ పోతోంది. భారత్ కూడా డ్రాగన్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా భారీ బలగాలను మోహరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్వేచ్ఛ లభించడంతో చైనా ఏమాత్రం తోకజాడించినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+