రుతు పవనాలపై వాతావరణ కేంద్రం కీలక అప్‌డేట్స్- గడువు సమీపించింది

తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ జూన్ 1వ తేదీ నాటికి క్రమం తప్పకుండా కేరళ వద్ద తీరాన్ని తాకుతుంటాయి నైరుతి రుతుపవనాలు. నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల రాకలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీనికి కారణాలు లేకపోలేదు.

అయిదు సంవత్సరాల్లో నమోదైన నైరుతి రుతు పవనాల కదలికలను పరిగణనలోకి తీసుకుంటే- 2018లో మే 29, 2019లో జూన్ 8, 2010లో జూన్ 1, 2022లో జూన్ 3వ తేదీన అవి కేరళ తీరాన్ని తాకాయి. ఇప్పుడు- 5వ తేదీ వచ్చిన వాటి జాడ కనిపించట్లేదు. భారత వాతావరణ కేంద్రం ముందుగా వేసిన అంచనాల ప్రకారం.. ఈ నెల 4వ తేదీ అంటే ఆదివారం నాటికే రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది.

monsoon-

ఈ అంచనా తప్పింది. సోమవారం కూడా రుతు పవనాల జాడ కనిపించలేదు. 7వ తేదీ వరకు అవి కేరళ తీరాన్ని తాకకపోవచ్చంటూ వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది. దీని ఫలితంగా- రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన ఎండ తీవ్రత ఎక్కడే గానీ తగ్గట్లేదు. కేరళ తీరం వైపుగా రుతు పవనాల కదలికలు స్తంభించిపోవడానికి కారణాలను వెల్లడించింది వాతావరణ కేంద్రం.

ఇప్పుడు రుతు పవనాలపై తాజా అప్‌డేట్ ఇచ్చింది వాతావరణ కేంద్రం. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. రుతుపవనాల కదలికలకు అనుకూల వాతావరణం నెలకొని ఉందని పేర్కొంది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతం, లక్షద్వీప్, కేరళ తీరంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలముకున్నాయని, పశ్చిమం నుంచి ఈదురుగాలులు వీస్తోన్నాయని వివరించింది.

అలాగే- అరేబియా సముద్రం దక్షిణం వైపు నుంచి పడమటి దిశగా గాలులు వీయడం, ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు పశ్చిమ వైపు నుంచి గాలులు వీస్తోండటం వల్ల నైరుతి రుతుపవనాలు పురోగమించడానికి దోహదం చేస్తోన్నాయిన వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ 48 గంటల వ్యవధిలో అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంతో పాటు లక్షద్వీప్, కేరళ తీరంలో మేఘాలు మరింత దట్టంగా అలముకునే అవకాశం లేకపోలేదని తెలిపింది.

తీరాన్ని తాకిన కొద్ది రోజుల్లోనే మిగిలిన రాష్ట్రాలకు విస్తరిస్తాయని పేర్కొంది. ఫలితంగా కేరళ రాజధాని తిరువనంతపురం సహా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు సైతం పడుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి కేరళలో వర్షాల తీవ్రత పెరుగుతుందని అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+