Ooty Temperature Record: ఊటీలో 73 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు బ్రేక్..!
దేశవ్యాప్తంగా ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మైదాన ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత చల్లటి ప్రదేశాలుగా, హిల్ స్టేషన్లుగా ఇంతకాలం మనం చెప్పుకుంటున్న ప్రాంతాలు సైతం ఈసారి మండిపోతున్నాయి. ప్రతీ ఏటా వేసవిలో దేశంలో వేడిని తట్టుకోలేక హిల్ స్టేషన్లను ఆశ్రయించే జనం ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోలేని పరిస్ధితి.
ఇదే క్రమంలో దేశంలోని చల్లటి ప్రాంతాల్లో ఒకటైన తమిళనాడులోని ఉదకమండలం (ఊటీ) కూడా వేడెక్కింది. అది ఏ స్ధాయిలో అంటే గత 73 ఏళ్లలో తొలిసారి ఊటీలో రికార్డు స్ధాయి ఉష్ణోగ్రత నమోదైంది. తాజాగా ఈ మేరకు ఊటీలో 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తమిళనాడు వాతావారణ విభాగం ప్రకటించింది. సాధారణ రోజుల్లో ఊటీలో ఉష్ణోగ్రత కేవలం 5.4 డిగ్రీలు మాత్రమే. అంటే ఊటీలో వాతావరణం ఏ స్ధాయిలో మారిపోయిందో తెలుస్తోంది.

Today UDAGAMANDALAM reported 29.0 °C as highest Maximum Temperature ever recorded. The departure from normal is 5.4°C.
— Tamilnadu Weather-IMD (@ChennaiRmc) April 28, 2024
1951 ఏప్రిల్ లో చివరి సారిగా ఊటీలో 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరిగి 73 ఏళ్ల తర్వాత అదే 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఇప్పుడు నమోదైంది. దీంతో ఏటా వేసవిలో ఊటీకి వెళ్లే వీఐపీలు సైతం మనసు మార్చుకోవాల్సిన పరిస్దితి కనిపిస్తోంది. వాస్తవానికి ఊటీతో పాటు తమిళనాడులోని పాలక్కాడ్, ఇతర చల్లటి ప్రాంతాల్లోనూ ఈసారి వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దీని ప్రభావం ఊటీ మీద కూడా పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ పర్యాటక స్ధలం కావడంతో అక్కడి రిసార్టులు, హోటళ్లకు గిరాకీ తగ్గుతోంది.
#Ooty at 29°C not only records the highest temperature during the month of April since 1951, but it is an All Time Record for the hottest day ever since 1951 according to the IMD CDSP portal. #Summer2024 #Heatwave #WxwithCOMK https://t.co/jMXIcYmkTA pic.twitter.com/tnDl2ULa6g
— Chennai Rains (COMK) (@ChennaiRains) April 28, 2024
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications