వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Opinion Poll: యూపీలో బీజేపీ సునాయాస విజయం, రెండోసారి సీఎంగా యోగి, 250 సీట్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు ఓపీనియన్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, టైమ్స్ నౌ-నవభారత్ వేటో(వీఈటీవో) ఓపినియన్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు కూడా బీజేపీ మరోసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తెలిపింది.

రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్

రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్

1985 తర్వాత యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొంది. ఈ ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 403 సీట్లలో 230-249 స్థానాల్లో విజయం సాధించనుందని వేటో టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన ఓపినియన్ పోల్స్‌లో తేలింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 325 సీట్లు రావడం గమనార్హం.

యూపీ ఎన్నికల్లో పుంజుకోనున్న అఖిలేష్ పార్టీ..

యూపీ ఎన్నికల్లో పుంజుకోనున్న అఖిలేష్ పార్టీ..

ఇక మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 137-152 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఓపినియన్ పోల్ వెల్లడించింది. మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)కి 9-14 సీట్ల, ఇక కాంగ్రెస్ పార్టీ మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని పేర్కొంది. 2017లో కంటే బీజేపీ కూటమికి ఓటు షేర్ తగ్గనుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 38.6 శాతం ఓట్ షేర్ రానుంది. ఎస్పీ కూటమికి 2017 ఎన్నికల్లో కంటే ఎక్కువగా 34.4 శాతం ఓటు షేర్ రానుంది. బీఎస్పీకి 2017లో 22.2 శాతం ఓటు షేర్ రాగా, వచ్చే ఎన్నికల్లో 14.1 శాతానికి పడిపోనుందని తెలిపింది. ఈ పార్టీ ఓటు షేర్ ను బీజేపీ, ఎస్పీ పంచుకునే అవకాశం ఉందని పేర్కొంది.

Recommended Video

interview with bjp state president bandi sanjay on huzurabad by poll trends
లఖింపూర్ ఖేరీ ఘటన మినహా బీజేపీకి అంతా సానుకూలమే

లఖింపూర్ ఖేరీ ఘటన మినహా బీజేపీకి అంతా సానుకూలమే


యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడుతుందని యూపీలో మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే యూపీ ప్రజలు మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఓపినియన్ పోల్స్ తేల్చింది. లఖింపూరఖేరీ ఘటన బీజేపీకి కొంత నష్టం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ గతం కంటే కొన్ని సీట్లు తగ్గించుకుని అధికారానికి కావాల్సిన మెజార్టీ సీట్లను దక్కించుకుంటుందని తెలిపింది. ఈ ఓపినియన్ పోల్ డిసెంబర్ 16 నుంచి 30 వరకు 21,480 మందితో నిర్వహించారు.

English summary
Opinion Poll: ‘BJP set for comfortable UP win, alliance may bag 230-249 seats’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X