ప్రతిపక్షాలు దేశాన్ని ఐసీయూలోకి నెడతాయి .. బీజేపీ కార్యకర్తల వీడియో కాన్పరెన్స్ లో మోదీ

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. విపక్షాలన్నీ దేశాన్ని ఐసీయూలోకి నెడతాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దేశ ప్రయోజనాలు పట్టవు ..

దేశ ప్రయోజనాలు పట్టవు ..

విపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మోదీ. విపక్షాలనీ కాలగూర గంపలా తయారయ్యాయని తనదైనశైలిలో విమర్శించారు. వాటిని నమ్మితే దేశాన్ని ఐసీయూలోకి నెట్టే ప్రమాదం ఉందని వ్యంగ్యాస్త్రలు సంధించారు.

అభివృద్ధిని మరచిన యూపీఏ

అభివృద్ధిని మరచిన యూపీఏ

గురువారం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. 2004 తర్వాత దేశంలో సులభతర వాణిజ్య విధానంలో వెనుకబడి ఉన్నామని .. అప్పుడు అభివృద్ధి పథకాలు లేవని, అవినీతి ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నామని వివరించారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా అదేవిధంగా పనిచేస్తామని స్పష్టంచేశారు.

అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్

అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్

బీజేపీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మోదీ. ఢిల్లీ నుంచి మోదీ లైవ్ లో ఉండగా ... దేశంలోని 15 వేల ప్రాంతాల నేతలతో మాట్లాడారు. దీనిని అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ అని బీజేపీ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+