ఇటు బెంగళూరులో విపక్షాల భేటీ... అటు ఢిల్లీలో NDA మిత్రపక్షాల సమావేశం.. టార్గెట్ 2024

దేశంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా ఐక్యత రాగం ప్రతిపక్షాలకు దీటుగా బిజెపి కూడా కొత్త ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న చిన్న పార్టీలను కలుపుకుంటూ బీజేపీ నేత్రుత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ కూటమిని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం నేడు జరగనుంది. మొత్తం ఈ భేటీలో 38 రాజకీయ పార్టీలు పాల్గొంటాయి.

నేడు సాయంత్రం ఐదు గంటలకు అశోక హోటల్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఒకప్పుడు కూటమిలో బిజెపి తర్వాత పెద్ద దిక్కులా వ్యవహరించిన కొన్ని పార్టీలకు ఈ భేటీకి ఆహ్వానం అందలేదు. అందులో ముఖ్యంగా శిరోమణి అకాలీదళ్, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి . ఎన్డీయే ను బలోపేతం చేయడం కోసం కమలనాధులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

Opposition meeting in Bengaluru... NDA allies meeting in Delhi... Target 2024

ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన, తమిళనాడు అన్నాడీఎంకే, మహారాష్ట్ర శివసేన ఏకనాథ్ షిండే వర్గం, ఎన్సిపి అజిత్ పవార్ వర్గం, రాష్ట్రీయ లోక్ సమత పార్టీకి చెందిన ఉపేంద్రకుశ్వాహా, లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ తదితరులకు ఆహ్వానం అందింది. గతానికి భిన్నంగా ఈ దఫా ఐదు శాతం కంటే తక్కువ ఓటుబ్యాంకు ఉన్న చిన్నపార్టీలతో జత కడుతున్నారు. 2024 ఎన్నికల లక్ష్యంగా బిజెపిని ఎదుర్కోవడానికి విపక్షాలకూటమి బెంగళూరులో కీలకభేటీని నిర్వహిస్తోంది.

నిన్న రాత్రి రెండు గంటల పాటు సాగిన ఈ కీలక భేటీలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ను ఫిక్స్ చేసే పనిలో విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం భావసారూప్యత కలిగిన విపక్ష పార్టీలన్నీ ఎన్డీఏ ను ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తాయని భేటీ అనంతరం మల్లికార్జున ఖర్గే తెలిపారు.

బెంగళూరులో జరుగుతున్న ఈ విపక్షాల కీలక భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిప్యూటీసీఎం తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు కూడా విపక్ష పార్టీలు కీలక భేటీ నిర్వహించి వచ్చే ఎన్నికలలో గద్దె దించడానికి ఏం చేయాలి అన్నది వ్యూహాలు సిద్ధం చెయ్యనున్నారు. విపక్షాల తొలిరోజు భేటీకి ఎన్సిపి అధినేత శరత్ పవార్ హాజరు కాలేదు. అయితే నేడు ఆయన సుప్రియ సూలేతో పాటు భేటీకి హాజరవుతారని సమాచారం. ఇటు విపక్షాలు కూడా ఎన్డీఏ కూటమికి దీటుగా ఐక్య కూటమిని ఏర్పాటు చేసి ఐక్య కూటమి పేరు ఖరారు చేసి లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతుంది. దీంతో రెండు కీలక భేటీల నేపథ్యంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+