వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిజాబ్ వివాదం- కర్నాటక కాలేజీ తీరుపై దుమ్మెత్తిన విపక్షాలు-బీజేపీ సర్కార్ పై ఫైర్

|
Google Oneindia TeluguNews

కర్నాటకలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ముస్లిం బాలికల్ని హిజాబ్ లు ధరిస్తే ప్రవేశం నిరాకరించడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. మత రహితంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, కాలేజీలు ఇలాంటి ధోరణుల్ని ప్రోత్సహించడమేంటని విపక్ష కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి.

హిజాబ్ ధరించినందుకు ముస్లిం బాలికలకు కాలేజీల్లో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కర్నాటకలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక ప్రభుత్వ సర్క్యులర్‌లో ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేయడం లేదని ఆయన గుర్తుచేశారు. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరవడాన్ని మాజీ ముఖ్యమంత్రి సమర్థించారు, వారు మొదటి నుండి దానిని ధరించారు.

opposition parties lambast on karnataka college for denying entry to muslim girls wearing hijab

ఇది ప్రాథమిక హక్కు అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తరగతుల సమయంలో హిజాబ్‌ను ఉపయోగించడాన్ని నిరసిస్తూ కాషాయపు శాలువలు ధరించి కళాశాలలకు వెళ్తున్న విద్యార్థుల్లోని ఓ వర్గాన్ని ఉద్దేశించి... వారు గతంలో వాటిని ధరించారా? పాఠశాలకు, కళాశాలకు వచ్చినప్పుడల్లా కాషాయరంగు ధరించేవారా? ఇది రాజకీయ ప్రేరేపితమైనది. ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అటు కశ్మీర్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రులు మెహబాబూ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కూడా కర్నాటక కాలేజీ చర్యల్ని ఖండించారు. హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు విద్యను నిరాకరించడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం.. బాలికలకు విద్య అందించాలంటుూ ఇస్తున్న నినాదం ఒట్టిదేనని అర్ధమవుతోందని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు.

"బేటీ బచావో బేటీ పర్హావో అనే నినాదం కూడా ఇక్కడ వర్తించదా అని ఆమె ప్రశ్నించారు. కేవలం వస్త్రధారణ కారణంగానే ముస్లిం బాలికలకు విద్యాహక్కు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశాపరు. గాంధీజీ భారతదేశాన్ని గాడ్సే భారత్‌గా మార్చే దిశగా ముస్లింల అట్టడుగు వర్గాలకు చట్టబద్ధత కల్పించడం మరో ముందడుంటూ ఆమె ట్వీట్ చేశారు.

కశ్మీర్ మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం కర్నాటక కాలేజీ తీరును తప్పుబట్టారు. ముస్లిం విద్యార్థినులకు వ్యతిరేకంగా డ్రెస్‌కోడ్‌ విధించడంపై ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. దీనికి ప్రతిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నాయకురాలు ఉమాభారతి, భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కాషాయ వస్త్రాలు ధరించిన చిత్రాలను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "వ్యక్తులు ఏమి ధరించాలో ఎంచుకోవచ్చు. మీరు వారి ఎంపికను ఇష్టపడవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు, కానీ అది మనందరికీ ఉన్న హక్కు. ఈ ప్రజా ప్రతినిధులు కాషాయ వస్త్రాలు ధరించగలిగితే, ఈ అమ్మాయిలు హిజాబ్ ఉపయోగించవచ్చు. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు' అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

English summary
opposition parties including congress, national conference has lashed out on karnataka college admin's decision to deny entry to muslim girls with hijab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X