వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవేం మాటలు.. ఆర్మీ చీఫ్ నోట రాజకీయాలా? దుమ్మెత్తిపోసిన విపక్షాలు

కాశ్మీర్ లో చెత్తయుద్దం సాగుతోందని , ఈ యుద్దంలో వినూత్న పద్దతుల్లో పోరాడాలని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాశ్మీర్ లో చెత్తయుద్దం సాగుతోందని , ఈ యుద్దంలో వినూత్న పద్దతుల్లో పోరాడాలని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి.

రావత్ వాడుతున్న బాషను తాను చిన్నప్పటినుండి వింటున్న భారత సైన్యానిదికాదన్నారు సిపిఎం నేత మహ్మద్ సలీం. రావత్ మాటలు వింటే ఆయన మానసినస్థఇతిపై అనుమానం కలుగుతోందన్నారు.

Opposition party leaders rebuts Army Chief's remark

బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు దేశ అంతర్గత భద్రతపై రాజకీయవ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించాయి. ఆర్మీ చీప్ రాజకీయ వివాదాలకు కేంద్రం కావడం దురదృష్టకరమని సిపిఐ నేత డి. రాజా అన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సింది సైన్యం కాదన్నారు. రాజకీయ నాయకత్వం అవసరమని ఆయన తేల్చిచెప్పారు.

రావత్ రాజకీయ వ్యాఖ్యల్ని చేయడం మానుకోవాలని జనతాదళ్ (యూ) నేత కె.సి .త్యాగి సూచించారు. వేర్పాటువాద సంస్థ హురియత్ తో కాకపోయినా సాధారణ కాశ్మీరీలతో సైన్యం సత్సంబంధాలను ఏర్పాటుచేసుకోవాలని ఆయన సూచించారు.

కాశ్మీర్ సమస్యను శాంతిభద్రతల కోణంలో మాత్రమే చూడలేమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా స్పష్టం చేశారు. నిరంతరం చర్చలు జరపడంతోనే కాశ్మీరీ యువత పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి వస్తోందన్నారు. కాశ్మీరీ యువత భద్రతా బలగాలపై రాళ్లు విసరడమన్నది చాలా తీవ్రమైన సమస్యని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే రావత్ వ్యాఖ్యల్ని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమర్థించారు. కాశ్మీర్ లో పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్యనైనా తీసుకొంటామని రావత్ చెప్పారు. అయితే తాను దాన్నే సమర్థిస్తానని వెంకయ్య ట్విట్టర్ లో తెలిపారు.

English summary
Congress, cpi, cpm and jd(U) leaders criticized Army chief Bipin Rawat's message to the Army that fighting a dirty war in Jammu and Kashmir needs innovative methods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X