ED: ఛలో ఈడీ ఆఫీస్‍కు పిలుపునిచ్చిన విపక్షాలు.. అడ్డుకున్న పోలీసులు..

అదానీ గ్రూప్ పై ఇండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

అదానీ వివాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ 18 ప్రతిపక్ష పార్టీల నేతలు చేపట్టిన ఛలో ఈడీ కార్యాలయానికి పిలుపునిచ్చారు. ఈడీ కార్యాలయం వైపు దూసుకెళ్తున్న నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. అదానీ గ్రూప్ పై హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బీజేపీ రాజకీయ లక్ష్యాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించాయి.

భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

విపక్ష నేతల ఛలో ఈడీకి పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నాయకులను ED కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వారు ముందుకు కదలలేకపోవడంతో ప్రతిపక్ష నాయకులు తిరిగి పార్లమెంటుకు చేరుకున్నారు. తాము ఈడీ అపాయింట్‌మెంట్ కోరామని, త్వరలో సంయుక్తంగా ఫిర్యాదు చేస్తామని విపక్ష నేతలు తెలిపారు.

మల్లికార్జున ఖర్గే

మల్లికార్జున ఖర్గే

తాము 200 పోలీసులు 2 వేల మంది ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రభుత్వం తమ గొంతును అణచివేయాలని చూస్తుందని చెప్పారు. సమస్యలపై మాట్లాడితే దేశ వ్యతిరేకులని ముద్ర వేస్తారని లండన్ లో ఉన్న రాహుల్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదు.

భట్టి విక్రమార్క

భట్టి విక్రమార్క

ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాజ్ భవన్ వైపు దూసుకొచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హస్తం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు

జనవరిలో US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూప్ బ్రజాన్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్‌ చేస్తోందని ఆరోపించింది. స్టాక్ ధరలను పెంచడానికి ఆఫ్‌షోర్ షెల్ కంపెనీలను ఉపయోగించుకుందని పేర్కొంది. దీంతో అదానీ స్టాక్ ల్లో భారీ క్షీణత నమోదు అయింది. ఈ అంశంపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే ఈ అంశంపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+