ఎట్టకేలకు విలీనం: పన్నీరు డిమాండ్లకు పళని ఓకే, శశికళకు షాక్
ఎట్టకేలకు అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. విలీనంపై మాజీ సీఎం పన్నీరుసెల్వం సోమవారం ప్రకటన చేశారు.
చెన్నై: ఎట్టకేలకు అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. విలీనంపై మాజీ సీఎం పన్నీరుసెల్వం సోమవారం ప్రకటన చేశారు.
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో పన్నీరు, పళని వర్గాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా పన్నీరు విలీన ప్రకటన చేశారు. పన్నీరు డిమాండ్లకు పళనిస్వామి ఒకే చెప్పారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించేందుకు అంగీకరించారు. అలాగే, పన్నీరు వర్గం నేతలకు ఆర్థిక, గృహ, హోంశాఖలు ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా పన్నీరు సెల్వం మాట్లాడారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామని చెప్పారు. తమను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. అమ్మ ఆత్మ, కార్యకర్తల కోరికతో విలీనం జరిగిందని చెప్పారు.
కాగా, విలీనం నేపథ్యంలో పన్నీరు సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవి, పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్నారు. పన్నీరు సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications