చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

OPS vs EPS: స్టేజ్ మీద పన్నీర్ సెల్వం మీద నీళ్ల బాటిల్స్ తో దాడి ?, సొంత పార్టీలో రచ్చరచ్చ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఎంజీఆర్ తరువాత అమ్మ జయలలిత కనుసైగలతో కుక్కిన పేనుల్లా ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులు మరోసారి రచ్చరచ్చ చేశారు. జయలలిత అనారోగ్యంతో మరణించిన తరువాత ఆమె నమ్మినబంటు ఓ పన్నీర్ సెల్వం ఓ వర్గం, శశికళ మరో వర్గంగా అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. శశికళ ఆశీస్సులతో సీఎం అయిన ఎడప్పాడి పళనిస్వామి తరువాత పన్నీరు సెల్వంతో పోరాటం చేశారు. శశికళ జైలుకు వెళ్లిన తరువాత ఢిల్లీలోని కొందరు పెద్దలు జోక్యం చేసుకుని పన్నీర్ సెల్వం, పళనిస్వామిని ఒక్కటి చేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసి శశికళను పార్టీ నుంచి బహిష్కరించారు. తరువాత ఇద్దరు నాయకులు కలసి పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు నువ్వానేనా అంటూ పొట్లాడుకుంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో రెండు వర్గాల నాయకులు పోటాపోటిగా నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీర్ సెల్వం మీద మరో మాజీ సీఎం పళనిస్వామి వర్గీయులు నీళ్లబాటిళ్లతో దాడి చెయ్యడం కలకలం రేపింది. సభ నుంచి పన్నీర్ సెల్వం బయటకు వెళ్లిపోవడంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Marriage: కారు, గుర్రం పక్కనపెట్టి బుల్డోజర్ లో పెళ్లికొడుకు ఊరేగింపు, ఇంజనీర్ తెలివి, వైరల్ !Marriage: కారు, గుర్రం పక్కనపెట్టి బుల్డోజర్ లో పెళ్లికొడుకు ఊరేగింపు, ఇంజనీర్ తెలివి, వైరల్ !

 జయలలిత ప్రాణాలతో లేరని రెచ్చిపోయారు

జయలలిత ప్రాణాలతో లేరని రెచ్చిపోయారు

జయలలిత అనారోగ్యంతో మరణించిన తరువాత ఆమె నమ్మినబంటు ఓ పన్నీర్ సెల్వం ఓ వర్గం, శశికళ మరో వర్గంగా అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. శశికళ ఆశీస్సులతో సీఎం అయిన ఎడప్పాడి పళనిస్వామి తరువాత పన్నీరు సెల్వంతో పోరాటం చేశారు. కొంతకాలం పాటు పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకే పార్టీని సొంతం చేసుకోవాలని కోర్టుకు వెళ్లారు.

 ఢిల్లీ దెబ్బతో కలిసిపోయారు

ఢిల్లీ దెబ్బతో కలిసిపోయారు

శశికళ జైలుకు వెళ్లిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఢిల్లీలోని కొందరు పెద్దలు జోక్యం చేసుకుని పన్నీర్ సెల్వం, పళనిస్వామిని ఒక్కటి చేశారు. తరువాత పళనిస్వామి సీఎంగా, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా వాళ్ల పదవి కాలం పూర్తి చేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసి ఇప్పటికే శశికళను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇంతకాలం ఇద్దరు నాయకులు కలసి పని చేస్తున్నారు.

 ఆధిపత్య పోరు మొదలైయ్యింది

ఆధిపత్య పోరు మొదలైయ్యింది

కొంతకాలంగా అన్నాడీఎంకే పార్టీకి నాయకుడు ఒక్కడే ఉండాలని పళనిస్వామి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీకి ప్రస్తుతం పళనిస్వామి, పన్నీర్ సెల్వం రెండు స్థంభాలుగా ఉన్నారు. అయితే అన్నాడీఎంకే పార్టీని పళనిస్వామికి అప్పగించాలనే డిమాండ్ తెరమీదకు రావడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు మండిపడుతున్నారు.

 నువ్వా..... నేనా

నువ్వా..... నేనా

అయితే ఇప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు నువ్వానేనా అంటూ పొట్లాడుకుంటున్నారు. గురువారం చెన్నైలోని రాయ్ పేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో రెండు వర్గాల నాయకులు పోటాపోటిగా నినాదాలు చేశారు.

 పన్నీర్ మీద నీళ్ల బాటిల్స్ విసిరేసి ?

పన్నీర్ మీద నీళ్ల బాటిల్స్ విసిరేసి ?

మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీర్ సెల్వం మీద మరో మాజీ సీఎం పళనిస్వామి వర్గీయులు సమావేశం జరుగుతున్న సమయంలోనే నీళ్లబాటిళ్లతో దాడి చెయ్యడం కలకలం రేపింది. సభ నుంచి పన్నీర్ సెల్వం బయటకు వెళ్లిపోవడంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ఈనెల 11వ తేదీకి వాయిదాపడింది.

English summary
OPS vs EPS: O Panneerselvam supporters accused Edappadi-Palanisamy as all are drama in AIADMK party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X