శశికళ హెచ్చరిక, రాజ్ భవన్ వద్ద రౌడీ గ్యాంగ్: నిఘా నీడలో చెన్నై
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ గవర్నర్‌ను హెచ్చరించిన నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద, చెన్నైలో భద్రతను పెంచారు. పార్టీలో చీలిక తెచ్చేందుకే ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావు తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ గవర్నర్‌ను హెచ్చరించిన నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద, చెన్నైలో భద్రతను పెంచారు. పార్టీలో చీలిక తెచ్చేందుకే ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావు తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించడం లేదని ఆరోపించారు.
అలా చేస్తే తనలోని మరో కోణం చూపిస్తానని హెచ్చరించారు. దీంతో నిఘా వర్గాల హెచ్చరిక మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.

చెన్నైలోని హోటళ్లు, పెద్ద పెద్ద భవంతులు, కల్యాణ మండపాలలో శనివారం పోలీసుల పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. అక్కడ బస చేస్తున్నవారి వివరాలను సేకరించారు. హోటళ్లలో రికార్డులను పరిశీలించారు. అందరి గురించి ఆరా తీశారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయని భావిస్తూ యంత్రాంగం అప్రమత్తమైంది.












Click it and Unblock the Notifications