OPS Wife: పన్నీర్ సెల్వం భార్య మృతి, వరుస విషాదాలు, రాజకీయాలు పక్కపెట్టిన సీఎం, మంత్రులు !
చెన్నై/ మదురై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ కో ఆర్డినేటర్ ఓ. పన్నీర్ సెల్వం ఇంట్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పన్నీర్ సెల్వం వెంట కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఆయన జీవిత భాగస్వామి విజయలక్ష్మి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. గత వారం రోజులుగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పన్నీర్ సెల్వం సతీమణికి బుధవారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆమె మరణించారని వైద్యులు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీలకు అతీతంగా తమిళనాడు ఎమ్మెల్యేలు ఆసుపత్రి చేరుకుని పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి మృతికి సంతాపం ప్రకటించారు. తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ పన్నీర్ సెల్వంను ఓదార్చి ఆసుపత్రిలోనే చాలా సేపు ఉన్నారు.
దుఃఖం లో ఉన్న పన్నీరుసెల్వం కు కీలక నేతల పరామర్శ (ఫోటోలు)
తమిళనాడు ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న సీనియర్ మంత్రి దురైమురుగన్, మరో మంత్రి మా సుబ్రమణ్యం రాజకీయాలను, పార్టీలను పక్కన పెట్టి ఆసుపత్రిలోనే పన్నీర్ సెల్వంకు వెంట ఉన్నారు. తమిళనాడులో రాజకీయాలకు అతీతంగా అందరూ నాయకులు పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి అకాస్మిక మృతికి సంతాపం ప్రకటించారు.
Illegal
affair:
భర్తకు
బందరు
లడ్డూ
లాంటి
లవర్,
మరిదిని
రంగంలోకి
దింపిన
ఆంటీ,
ఇంట్లోనే
!

జయలలిత నమ్మిన బంటు
తమిళనాడుకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ. పన్నీర్ సెల్వంకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అన్నాడీఎంకే పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా అప్పట్లో అక్రమాస్తుల కేసులో జైలుకు వెలుతున్న సమయంలో జయలలిత ఆమె నమ్మిన బంటు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా చేశారు. జైలు నుంచి విడుదైన వెంటనే పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసి జయలలితను మళ్లీ ముఖ్యమంత్రిని చేశారు. ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా పన్నీర్ సెల్వం మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

పన్నీర్ కు ధైర్యం చెప్పి ముందుకు నడిపించిన విజయలక్ష్మి
జయలలిత మరణించిన సమయంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీర్ సెల్వం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. శశికళ రంగంలోకి దిగి ఎడప్పాడి పళనిస్వామిని సీఎం చేశారు. ఆ సమయంలో పన్నీర్ సెల్వం వెంట ఉన్న ఆయన సతీమణి విజయలక్ష్మి భర్తకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు.

రాజీ చేసిన ప్రధాని మోదీ అండ్ కో
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాన్ని రాజీ చేశారు. అనంతరం మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీర్ సెల్వం ఒక మెట్టు కిందకు దిగి తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎడప్పాడి పళనిస్వామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గం ఒక్కటి కావడంతో శశికళ వర్గానికి అప్పట్లో సినిమా కనపడింది. అనంతరం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం పదవి కాలం పూర్తి అయ్యే వరకు అధికారంలో ఉండేలా చక్రం తిప్పారు.

భార్య మృతితో కుప్పకూలిన పన్నీర్ సెల్వం
గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మి (63) చెన్నైలోని పెరంగూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో బుధవారం విజయలక్ష్మికి గుండెపోటు వచ్చింది. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో విజయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. భార్య విజయలక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకున్న తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుప్పకూలిపోయారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు అంటున్నాయి.

వరుస విషాదాలు
ఈ ఏడాదిలో పన్నీర్ సెల్వం కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏడాది పూర్తి కాకముందే పన్నీర్ సెల్వం కటుంబ సభ్యులు ముగ్గురు మరణించారు. ఇదే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి తల్లి వల్లియమ్మాళ్ అనారోగ్యంతో మరణించారు. ఆసమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి ఫళనిస్వామితో పాటు ఎంకే. స్టాలిన్ తదితరులు పన్నీర్ సెల్వం వెంటఉండి విజయలక్ష్మి అమ్మ వల్లియమ్మాళ్ మృతికి సంతాపం తెలిసి ఆమె అంత్యక్రియలు పూర్తి చేయించారు.

పన్నీర్ సొంత సోదరుడు
పన్నీర్ సెల్వం సొంత మూడో సోదరుడు బాలమురుగన్ గత మే నెలలో మరణించారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి మరణించడంతో పన్నీర్ సెల్వం ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయం చేయిస్తూ తేనీ జిల్లాలో ఉంటున్న పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ మరణించిన సమయంలో పన్నీర్ సెల్వం చాలా కుమిలిపోయారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
Recommended Video

పార్టీలు పక్కన పెట్టిన సీఎం. మంత్రులు
పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి అనారోగ్యంతో మరణించారని తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ఆయన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీలకు అతీతంగా తమిళనాడు ఎమ్మెల్యేలు చెన్నైలోని ఆసుపత్రి చేరుకుని పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి మృతికి సంతాపం ప్రకటించారు. తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ పన్నీర్ సెల్వంను ఓదార్చి ఆసుపత్రిలోనే చాలా సేపు ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న సీనియర్ మంత్రి దురైమురుగన్, మరో మంత్రి మా సుబ్రమణ్యం రాజకీయాలను, పార్టీలను పక్కన పెట్టి ఆసుపత్రిలోనే పన్నీర్ సెల్వంకు వెంట ఉన్నారు.