Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భక్తులతో కిటకిటలాడిన ప్రయాగరాజ్ కుంభమేళ, పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా హాజరు

Recommended Video

    Over 100 Million Gather For Kumbh Mela, Devotees To Take Holy Dip Today

    సంక్రాంతి సందర్భంగా అలహాబాదులోని ప్రయాగరాజ్ కుంభమేళ భక్తుల కోసం సిద్ధమైంది. ఇప్పటికే పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కొన్ని లక్షల్లో భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇక రానున్న 48 రోజుల్లో కోటికిపైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా అంతే ఆసక్తితో గంగా యమునా నదీ తీరాలకు చేరుకుంటున్నారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం గంగా యమునా సరస్వతి నదీ తీరంపై వెలిసింది.ఈ మూడు నదులను సంగం అని పిలుస్తారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తే తాము చేసిన పాపాలు పోయి మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడకు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడం వల్ల తమకు మనశ్శాంతి లభిస్తుందని భక్తులు చెప్పారు. ప్రస్తుతం నదితీరాలు కలర్‌ఫుల్‌గా మారాయి.

    Over 100 mn gather for Kumbh mela,devotees to take holy dip today

    దిగంబరులైన సాధువులు అక్కడికి వచ్చి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు దీవెనెలు ఇస్తూ కనిపించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ప్రయాగరాజ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కుంభమేళ సమయంలో ముక్కోటి దేవుళ్లు ఇక్కడ ఆశీనులవుతారని ఒక మానవుడికి ఇదొక అద్భుత తరుణమని భక్తులు చెప్పారు. ఇక చివరిసారిగా 2013లో అలహాబాదులో జరిగిన కుంభమేళకు 120 మిలియన్ మంది భక్తులు హాజరయ్యారు. అందులో ఒకే రోజు మూడు కోట్ల మంది నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. మార్చి 4 వరకు కుంభమేళ జరుగుతుంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ కుంభమేళను ఐక్యరాజ్యసమితి సంస్థ యూనెస్కో 2017లో ఒక సాంస్కృతిక పండగగా గుర్తించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+