ఫడ్నవీస్‌కు మహా సెగ: ముంబై సరిహద్దుల్లో 30 వేలకు పైగా రైతులు

Posted By:
Subscribe to Oneindia Telugu
  రైతుల లాంగ్ మార్చ్: అసెంబ్లీ ముట్టడికి సై ?

  థానే: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రైతుల మహా సెగ తగులుతోంది. వ్యవసాయ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన మార్చ్ చేపట్టిన రైతులు, ఆదివాసీలు ముంబై సరిహద్దులోకి చేరుకున్నారు.

  వేలాది మంది రైతులతో కూడిన భారీ మార్చ్ క్రమంగా సెంట్రల్ ముంబైలోని కెజి సోమయ మైదానికి చేరుకుంటోంది.మార్చి 12వ తేదీన రైతులు శానససభ వెలుపల నిరసనకు దిగనున్నారు.

  Over 30,000 ‘agitated’ Maha farmers reach Mumbai, demand loan waiver

  ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారంనాడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైతులకు శివసేన మద్దతు ప్రకటించింది. నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ, రాజ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కూడా రైతులకు మద్దతు ప్రకటించాయి.

  రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రాళ్ల వర్షం వల్ల, తెగుళ్ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 40 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, అటవీ సాగు భూమిని రైతులకు కేటాయించాలని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A protest march by the agitated farmers and adivasis from Maharashtra against the failure of BJP-led government to address agrarian distress has reached the Mumbai border.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి