భారత్‌లో ఉద్యోగం లేకుండా 30శాతం మంది యువత, దానికి రివర్స్

15-29 ఏళ్ల మధ్య వయస్కులు 30 శాతానికి పైగా ఇటు ఉద్యోగం లేదా అటు చదువు లేక ఖాళీగా ఉన్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నివేదిక తెలిపింది.

న్యూఢిల్లీ: 15-29 ఏళ్ల మధ్య వయస్కులు 30 శాతానికి పైగా ఇటు ఉద్యోగం లేదా అటు చదువు లేక ఖాళీగా ఉన్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నివేదిక తెలిపింది.

పైన చెప్పిన వయస్సు మధ్య ఉన్న యువతలో ముప్పై శాతానికి పైగా ఉద్యోగం, చదువే కాదు.. ఏ శిక్షణలోను లేరని ఆ సర్వే తెలిపింది.

ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన చైనా కంటే మన యువత చదువు, ఉద్యోగం లేకుండా ఉన్న వారు మూడు రెట్లు ఉన్నారు. మరో 35 రాష్ట్రాల కంటే రెండింతలుగా ఉంది.

Over 30% of India's youth not in employment, education

చైనా యువతలో 11.22 శాతం మంది చదువు, ఉద్యోగం లేకుండా ఉండగా, భారత దేశంలో అక్షరాలా 30.83 శాతంగా ఉంది.

ఉద్యోగం, చదువు, ట్రెయినింగ్ లేకుండా 15-29 ఏళ్ల మధ్య వయస్సు గల యువత చైనాలో 11.22 శాతం, రష్యన్ ఫెడరేషన్‌లో 14.04, బ్రెజిల్‌లో 19.96, అర్జెంటీనాలో 20.30, కొలంబియాలో 20.62, ఇండోనేషియా 23.24, భారత్‌లో 30.83, సౌతాఫ్రికాలో 36.65గా ఉంది.

మిగతా దేశాల కంటే భారత్ ఆర్థిక వృద్ధి రేటు రెండింతలు వేగంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఉద్యోగాల సృష్టిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఓఈసీడీ ప్రకారం ఇండియా వృద్ధి రేటు ఏడు శాతంగా ఉంది. కానీ ఉద్యోగాలు మాత్రం అలా లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+