బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు అతలాకుతలం: కుంభవృష్టితో నగరం జలమయం..

లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కుండపోత వర్షం బెంగళూరు నగరాన్ని ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్న ప్రకారం.. మరో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు తప్పేలా లేవు. దక్షిణ, మధ్య కర్ణాటక ప్రాంతంలో రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

 Overnight heavy rains wreak havoc in Bengaluru

మంగళవారం నాడు నగరంలోని హెచ్‌ఎఎల్‌ విమానాశ్రయం ప్రాంతంలో రికార్డు స్థాయిలో 143.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2012లొ కురిసిన 107.3 మిల్లీమీటర్ల వర్షపాతమే ఇక్కడ అత్యధికం కాగా.. నిన్నటి వర్షానికి ఆ రికార్డు స్థానంలో కొత్త రికార్డు వచ్చి చేరింది.

బెంగుళూరులో 14సెం.మీ వర్షపాతం నమోదు కాగా, మండ్య జిల్లాలో 13సెం.మీ వర్షపాతం నమోదైంది. మండ్య జిల్లాలో వర్షాలు కురుస్తుండటం.. కావేరీ నదిలో ప్రవాహాన్ని పెంచనున్నాయి.

English summary
The city was confronted with unexpected torrential rains late on Monday night, which continued into the wee hours of Tuesday morning. The rains caused much havoc on the streets, including heavy inundation and tree falls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X