నరేంద్ర మోడీ చేసిన పెద్ద తప్పు ఇది: చిదంబరం నిప్పులు
2016-17 సంవత్సరానికి గాను జిడిపి పెరుగుదల రేటు 6.1 శాతానికి తగ్గడంపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు.
న్యూఢిల్లీ: 2016-17 సంవత్సరానికి గాను జిడిపి పెరుగుదల రేటు 6.1 శాతానికి తగ్గడంపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు.
రూ.1000, రూ.500 నోట్ల రద్దు 2016లో జరిగిన అతి పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసంలో జిడిపి పెరుగుదల 6.1 శాతానికి తగ్గడం నిదర్శనం అన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిజమైన ఆర్థికవేత్తల సలహాలను పక్కనపెట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు.
భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సరైన నిర్ణయాలు తీసుకోక పెద్ద నోట్లు రద్దు చేసి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందన్నారు. దాని ఫలితంగా ఇండియన్ ఎకానమీ 1.3 శాతంమేర నష్టపోయిందన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందని, ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications