తొలి ట్రాన్స్‌జెండర్ పద్మినీ ప్రకాశ్ యాంకర్‌గా.. (ఫోటో)

న్యూఢిల్లీ: దేశ టెలివిజన్ రంగం చరిత్రలోనే తొలిసారిగా లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తి న్యూస్ యాంకర్ అవతారం ఎత్తారు.31 ఏళ్ల పద్మినీ ప్రకాశ్ తమిళనాడులోని లోటస్ న్యూస్ చానల్లో న్యూస్ యాంగర్‌గా పని చేస్తున్నారు. పద్మినీ ప్రకాశ్ వయస్సు (31. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పద్మిని ప్రస్తుతం లోటస్ చానల్లో న్యూస్ రీడర్ కం యాంకర్‌గా పని చేస్తున్నారు.

దేశంలో న్యూస్ రీడర్ అవతారమెత్తిన తొలి ట్రాన్స్ జెండర్‌గా పేరుపొందారు. లోటస్ చానల్లో రాత్రి ఏడింటికి ప్రసారమయ్యే స్పెషల్ బులెటిన్‌లో వార్తలు చదువుతున్నారు. బికాం ఫస్టియర్లో ఉన్నప్పుడు కుటుంబంతో సంబంధాలు తెంచుకున్న పద్మినీ ప్రకాశ్, అనంతరం భరతనాట్య శిక్షకురాలిగా ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం తన జీవిత భాగస్వామి వెళ్ళకినార్‌తో కలిసి కోయంబత్తూరు శివార్లలో నివాసముంటున్న పద్మిని, అనేక అందాల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు.

padmini prakash became the first transgender television news anchor

దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ టీవీ హోస్టుగా పేరు తెచ్చుకున్న రోజ్ వెంకటేశన్ మాట్లాడుతూ.. పద్మిని ఎంతో పట్టుదల గల వ్యక్తి అని, అందుకే, ఆమెను న్యూస్ యాంకర్ పోస్టుకు రికమెండ్ చేశానని తెలిపారు. లోటస్ చానల్ ప్రతినిధులు పద్మిని గురించి అడగ్గానే.. వృత్తిపరమైన ఒత్తిళ్ళు తట్టుకోగలదని, ఉద్యోగంలోకి తీసుకోవచ్చని చెప్పానన్నారు.

లోటస్ చానల్ యాజమాన్యం కూడా పద్మిని విధి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తోంది. పద్మిని కష్టించి పని చేస్తారని చానల్ చైర్మన్ జీకేఎస్ సెల్వకుమార్ కితాబిచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం ఆమె అద్భుతమైన న్యూస్ యాంకర్ అవుతుందని నిర్ధారించుకున్నామన్నారు.

జీవితంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని, వివక్షకు గురయ్యానని చెప్పారు. కుటుంబ సభ్యులే తనను తిరస్కరించారని అలా దేశంలో చాలామంది అవమానాలు పడుతున్నారన్నారు. ఈ అవకాశం రాకముందు డ్యాన్సర్‌గా, అనంతరం సబ్బుల ప్రకటనలో నటించినట్లు చెప్పారు.

న్యూస్ యాంకరింగ్ చేసేందుకు మొదట్లో తాను చాలా భయపడ్డానని, నెమ్మదిగా అన్నీ నేర్చుకున్నానని తెలిపారు. తొలినాళ్ళలో ఉచ్చారణ పట్ల ఎంతో ఆందోళనకు గురయ్యేదాన్నని, వార్తల స్వభావానికి తగిన విధంగా గొంతులో భావాలు పలికించేందుకు కష్టపడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఇప్పుడా సమస్యలన్నీ అధిగమించానన్నారు. గత నెలలోనే పద్మినీ యాంకర్‌గా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+