"అది వార్మ్- అప్ మాత్రమే.. నెక్స్ట్ 60 జెట్లు కూల్చేస్తాం".. భారత్ కు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వార్నింగ్
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్(PAF) మరోసారి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ లో సెప్టెంబర్ 6 న డిఫెన్స్ డే సందర్భంగా పాకిస్థాన్ లోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు పరేడ్ లు, విన్యాసాలు నిర్వహించాయి. ఈ సమావేశంలో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా మే 10న పాకిస్థాన్ చేపట్టిన ఆపరేషన్ బన్ యాన్ మర్సూస్ లో భారత్ కు చెందిన ఆరు ఫైటర్ జెట్స్ ను కూల్చేశామని.. పాకిస్థాన్ ఒక్క జెట్ ను కూడా కోల్పోలేదని కీలక ఆరోపణలు చేశారు. పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన యుద్ధంలో తమ స్కోరు 6-0 అని అన్నారు. అది వార్మ్- అప్ మాత్రమేనని భవిష్యత్తులో అల్లాహ్ కోరుకుంటే ఆ స్కోరును 60-0 కు తీసుకెళ్తామని ప్రగల్భాలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
🚨BREAKING: PAF warns India
— The Daily CPEC (@TheDailyCPEC) September 6, 2025
“6-0 was only the warm-up — next time it’ll be 60-0.” pic.twitter.com/jwouUoNqpe
ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా మే 10న పాకిస్థాన్ చేపట్టిన ఆపరేషన్ బన్ యాన్ మర్సూస్ లో తాము భారత్ లోని అనేక ఎయిర్ బేస్ లను టార్గెట్ చేశామని అందులో ఉదంపూర్ ఎయిర్ బేస్, పథాన్ కోట్, అదమ్ పుర్ ఎయిర్ బేస్ లు ఉన్నట్లు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చెప్పుకొచ్చింది.
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. దీంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.

వాటిలో ముజఫరాబాద్ లో ఉన్న సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అంతేకాక వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత పాకిస్థాన్ ధ్వంసం అయిన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మించుకుంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications