ఇంకా దక్షిణ కశ్మీర్లోనే పహల్గాం తీవ్రవాదులు ? ఎన్ఐఏ షాకింగ్ ..!

కశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు కాశ్మీర్ ను జల్లెడ పట్టడం ప్రారంభించాయి. దాదాపు వారం రోజులుగా కాశ్మీర్ ను బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. అయినా ఇంకా ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్ లోనే తలదాచుకున్నారన్న షాకింగ్ వాస్తవాన్ని ఎన్ఐఎ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇంకా వాళ్లను ఎందుకు పట్టుకోలేకపోతున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. అయితే అప్పటి నుంచీ ఈ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. సైన్యం, స్థానిక పోలీసులతో కూడిన భారీ వేట నుండి వీరు తప్పించుకుని తిరుగుతున్నారు. పరారీలో ఉన్న వారు ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు ఎన్టీడీవీకి వెల్లడించాయి. వారు దట్టమైన అడవుల్లో దాక్కుని ఉండొచ్చని భావిస్తున్నారు.

Pahalgam attack Terrorists Still In Kashmir says NIA sources

ఉగ్రవాదులు తమ వెంట సరుకులను తీసుకువెళుతుండవచ్చని ఎన్ఐఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే అడవుల్లో దాక్కుని ఉండటం వల్ల బలగాలకు దొరకడం లేదని తెలుస్తోంది. దీంతో అడవుల్లో అణువణువూ గాలించడం భద్రతా బలగాలకు ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. అయినా భద్రతా బలగాలకు తోడుగా స్ధానిక పోలీసులు సైతం ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటూ ఉగ్రవాదుల జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటికే పహల్గాం దాడిలో ఉగ్రవాదులు అత్యాధునిక యాప్ ఆధారిత కాల్స్ చేసుకుని రాడార్లకూ, నిఘా వర్గాలకూ అంతుబట్టకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇప్పుడు తప్పించుకుని తిరగడంలోనూ ఇలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఉపయోగిస్తూ ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలకు ఈ వేట సవాలుగా మారుతోంది. మరోవైపు వీరిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలన్న ఒత్తిడి కేంద్రంపై పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+