పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది వేళ.. లష్కరే తోయిబా సంచలన ప్రకటన

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22 న ఉగ్రమూకలు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ భయానక ఉగ్రదాడి జరిగిన సంవత్సరం కావొస్తుంది. అయితే ఈ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కు ఈ గౌరవం దక్కడానికి పహల్గామ్ ఉగ్రదాడే కారణం అని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ పరపతి పెరగడానికి గతేడాది భారత్ లో జరిపిన పహల్గామ్ ఉగ్రదాడే కారణం అని లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్ అబు మూసా కష్మీరీ పేర్కొన్నాడు. ఇవాళ ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య చర్చలు జరిపే స్థాయికి పాకిస్థాన్ వెళ్లిందంటే అందుకు కారణం పహల్గామ్ ఉగ్రదాడి అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అతడి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ దాడితో పాకిస్థాన్ పరపతి ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగిందని అన్నాడు.

Pahalgam Terror Attack Enhanced Pakistan s Global Image Lashkar-e-Taiba commander Abu Musa Kashmiri

ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్టు కమాండర్ అబు మూసా కష్మీరీ ఈ వ్యాఖ్యలు చేయడం.. భారత్ ను మరోసారి రెచ్చగొడుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది మే 7- 10 మధ్య ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇందులో భాగంగా వందలాది ఉగ్రవాదుల్ని భారత సైన్యం ఏరివేసింది.

ఈ క్రమంలో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది భారత సైన్యం. వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా నేలమట్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+