pahalgam terror attack: యాక్టివ్ అయిన స్లీపర్ సెల్స్.. ఇంటిలిజెన్స్ హెచ్చరిక!

జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ దాడి ఘటన దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అందాలు చూడటానికి వెళ్ళిన పర్యాటకులను అత్యంత అమానవీయంగా ఉగ్రవాదులు హతమార్చడంతో, అది కూడా మతతత్వ వాదంతో హతమార్చడంతో ఒకసారిగా ప్రభుత్వం సైతం ఉలిక్కిపడింది.

భారత ఆర్మీ హై అలెర్ట్
ఇటువంటి దారుణ ఘటనలు జరగకుండా కఠినమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలను తీసుకుంది. పాకిస్తాన్ తో ఉన్న కాస్తో కూస్తో సంబంధాలను కూడా తెగ తెంపులు చేసుకుంది. పాకిస్తాన్ పైన సమరానికి సయ్యంది. ఇక ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో దాడి జరిగిన తర్వాత భారత ఆర్మీ ఉగ్రమూకను ఏరి వేయడానికి అడుగడుగున జల్లెడ పడుతుంది.

Pahalgam terror attack sleeper cells Active Intelligence warning

48 టూరిస్ట్ కేంద్రాలను మూసేసిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం
పహల్గామ్ దాడి ఘటన తర్వాత హై అలెర్ట్ గా ఉన్న భారత ఆర్మీ ఉగ్రవాదం అణిచివేసేందుకు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా సోదాలు చేపట్టింది. ఇప్పటికే భారత్ లోకి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతం చేసింది. ఇక ఇదే సమయంలో కాశ్మీర్లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కాశ్మీర్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపధ్యంలో 48 టూరిస్ట్ కేంద్రాలను జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మూసివేసింది.

స్లీపర్ సెల్స్ యాక్టివ్.. ఇంటిలిజెన్స్ హెచ్చరిక
పహల్గామ్ దాడి ఘటన తర్వాత కాశ్మీర్ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. కాశ్మీర్ వ్యాప్తంగా మొత్తం 87 ప్రదేశాలలో టూరిస్టు కేంద్రాలు ఉన్నాయి. దీంతో అన్నిచోట్ల వాటిని మూసి వేస్తూ కాశ్మీర్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నిన్న జమ్మూ కాశ్మీర్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది.

పాశవిక దాడిని ఖండించి తీర్మానం చేసిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ
ఉగ్ర దాడిలో చనిపోయిన మృతులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. ఉగ్రవాదుల పాశవిక దాడి పై తీవ్ర దిగ్భ్రాంతిని ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉగ్రదాడి ఘటనపై వ్యాఖ్యలు చేశారు.

ఆవేదన వ్యక్తం చేసిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
గత 21 ఏళ్ళలో ఇదే తొలిసారి అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు..రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను క్షేమంగా పంపాల్సిన బాధ్యత తమదని, కానీ ఆ పని చెయ్యలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏ విధంగా క్షమాపణలు చెప్పాలో తెలీటం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+