'పాకిస్తాన్‌తో యుద్ధం జరగొచ్చు, భారత్ సిద్ధంగా ఉండాలి'
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ నిత్యం కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, కాబట్టి ఇది యుద్ధానికి సంకేతంగా భావించవచ్చునని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సోమవారం నాడు మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పారు.
పాకిస్తాన్ సైన్యం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి పాలనను తమ చేతుల్లోకి తీసుకుంటుందని అన్నారని, అలాగే పాక్ రేంజర్లు నిరంతరం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనిని బట్టి పాక్‌తో మనకు యుద్ధం జరగవచ్చని సంకేతాలుగా భావించాలన్నారు.

పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే మనం అన్ని విధాలుగా సన్నద్దంగా ఉండాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కాగా, భారత్ - పాక్ సరిహద్దుల్లో పాక్ నిత్యం కాల్పులను జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందిస్తోంది.
అయితే, నిత్యం కాల్పుల విరమణ చట్టాన్ని పాక్ ఉల్లంఘించడం గమనార్హం. సెప్టెంబర్ 29వ తేదీన పీవోకేలో సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయి. ఆ తర్వాత పాకిస్తాన్ వందసార్లు కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘించింది. పలువురు జవాన్లు, సాధారణ ప్రజలు కూడా చనిపోయారు.
సరిహద్దుల్లో పాకిస్తాన్ నిత్యం కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, కాబట్టి ఇది యుద్ధానికి సంకేతంగా భావించవచ్చునని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సోమవారం నాడు మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పారు.












Click it and Unblock the Notifications