దిగొచ్చిన పాక్ - కుల్‌భూషణ్ కేసులో కీలక నిర్ణయం - పార్లమెంటులో రచ్చ - ఆంక్షల భయం
ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విషయంలో దాయాది పాకిస్తాన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను రివ్యూ చేయాలని, ఆమేరకు అతనికి న్యాయ సహకారం అందేలా చూడాలని అంతర్జాతీయ కోర్టు(ఐసీజే) ఆదేశించడంతో విధిలేని పరిస్థితితుల్లో పాక్ ముందడుగు వేసింది. దీనిపై జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)లో తీవ్రవాదోపవాదాలు నడిచాయి. చివరికి..
కుల్‌భూషణ్ జాదవ్ కు ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించే బిల్లుకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు చేసిన సిఫార్సులను సభ ఆమోదించిందని, తద్వారా తన మరణశిక్షను హైకోర్టులో సవాలు చేసే అవకాశం కుల్‌భూషణ్ కు లభించిందని పాక్ సర్కారు వెల్లడించింది.

నిజానికి జాదవ్ కు న్యాయ సహాయం అందించాలని ఐసీజే గతేడాదే తీర్పు చెప్పినా.. ఆ ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తూ పాక్ డ్రామాలాడింది. జాదవ్ ను కలవనీయకుండా లాయర్లను అడ్డుకుంది. దీంతో భారత్ మరోసారి ఐసీజేను ఆశ్రయించే ప్రయత్నం చేసింది. మొత్తంగా ఈకేసులో అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను పాటించకపోతే పలురకాల ఆంక్షలు ఎదుర్కోనే పరిస్థితి నెలకొనడంతో పాక్ ఎట్టకేలకు జాదవ్ బిల్లును ఆమోదించింది. కాగా,
జాదవ్ కు మరణశిక్షను సవాలు చేసుకునే అవకాశం కల్పించడంపై పాక్ జాతీయ అసెంబ్లీలో రచ్చ చెలరేగింది. ప్రతిపక్ష ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, జామాయత్ ఉలేమా-ఈ-ఇస్లాం సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే ఓటింగ్ సమయంలో అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు చాకచక్యంగా వ్యవహరించడంతో బిల్లుకు ఆమోదం లభించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) సూచనల మేరకు తన మరణ శిక్షను సవాలు చేసుకునే అధికారం జాదవ్ కు కల్పించకపోతే.. ఐసీజే తీర్పును బేఖాతరు చేసినట్లవుతుందని, దాంతో పాక్ ఆంక్షల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టే సకాలంలో బిల్లును పాస్ చేశామని పాకిస్తాన్ ఫెడరల్ లా అండ్ జస్టిస్ మంత్రి ఫరాగ్ నసీమ్ తెలిపారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications