చైనాతో పాటు పాకిస్థాన్ కూడా .. నౌగాం సెక్టార్ మీదుగా కాల్పులు.. తిప్పికొట్టిన భారత్

ఒక పక్క చైనా దుశ్చర్యలు , 20 మంది జవాన్ల దారుణ మరణాలు , మరోపక్క కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే ఇక ఇదే సమయం అన్నట్టు పాకిస్థాన్ కూడా దాడులకు తెగబడుతుంది. ఒకపక్క చైనాతో లడఖ్ వాస్తవాధీన రేఖ వద్ద తీవ్ర ఘర్షణ కొనసాగుతుంటే ఇప్పుడు ఊహించని పరిణామంగా పాకిస్థాన్ కూడా అక్రమ చొరబాట్లకు సిద్ధపడింది .

మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్

మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్


పాకిస్థాన్ మళ్లీ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు చైనా ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ పాక్ మాత్రం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు పాక్ సైన్యం పరోక్షంగా సహాయం చేస్తోంది అని సమాచారం . భారత సైనిక శిబిరాలను, సరిహద్దులోని గ్రామాలను టార్గెట్ చేస్తూ పాకిస్థాన్ దాడులకు దిగుతోంది.

పాక్ రేంజర్ల కాల్పులను తిప్పికొట్టిన భారత ఆర్మీ

పాక్ రేంజర్ల కాల్పులను తిప్పికొట్టిన భారత ఆర్మీ

దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్ కాల్పులకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా బుధవారం నాడు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ నౌగాం సెక్టార్‌ వద్ద పాక్ సైన్యం కాల్పులకు దిగారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. గత మూడు నెలలుగా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ కాల్పులకు దిగుతోంది.

Recommended Video

    ICC Cricket World Cup 2019 : England Vs Pakisthan Match Preview
     రెండు వైపుల నుండి ఇండియాను టార్గెట్ చేస్తున్న చైనా , పాకిస్థాన్

    రెండు వైపుల నుండి ఇండియాను టార్గెట్ చేస్తున్న చైనా , పాకిస్థాన్

    ఒకపక్క సరిహద్దు దేశం అయిన డ్రాగన్ కంట్రీ వ్యవహారం పై చాలా సీరియస్ గా ఉన్న వేళ ఇప్పుడు పాకిస్థాన్ కూడా ఈ తరహా చర్యలకు పాల్పడటం భారత దేశానికి కాస్త ఇబ్బందికరమే. ఇప్పుడు భారత్ ను శత్రువులుగా భావిస్తున్న చైనా ఒక వైపు నుండి , పాకిస్థాన్ మరో వైపు నుండి మూకుమ్మడి దాడులకు దిగితే ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందో లేదో అన్న విషయం పక్కన పెడితే అదును చూసి ఇండియాను దెబ్బ కొట్టాలని దాయాది దేశాలు కాచుకు కూర్చున్నాయి అన్నది మాత్రం తాజా పరిణామాలను బట్టి వాస్తవం అనిపిస్తుంది

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+