బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇక ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోయాయి. పాకిస్థాన్ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా అయింది.
అసలే అప్పుల కుప్పగా మారిన పాకిస్థాన్ లో ఇప్పుడు చమురు, గ్యాస్ సంక్షోభం వెంటాడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా లాక్ డౌన్ ప్రకటించింది. రాత్రి 8 వరకే షాపులు తెరిచి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్కూల్స్, కాలేజీలు మూసివేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరెంట్ సంక్షోభం కారణంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు విద్యుత్ డిమాండ్ భారీగా ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దాంతో ఈ సమయంలో దాదాపు రెండు నుంచి రెండున్నర గంటల పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని తెలిపింది. ఇక పీక్ అవర్స్ లో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు ఖరీదైన ఆయిల్ ప్లాంట్స్ పై ఆధారపడాల్సి వస్తోందని.. దానివల్ల విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని అక్కడి నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే దేశంలోని కరాచీ, హైదరాబాద్(పాకిస్థాన్) నగరాలను ఈ కరెంట్ కోతల నుంచి మినహాయించినట్లు సమాచారం. ఈ నగరాల్లో తక్కువ ధరకే విద్యుత్ లభ్యం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది సాధారణ లోడ్ షెడ్డింగ్ కాదని.. దేశంలోని విద్యుత్ ధరలను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఇంధన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా ఒక్కో యూనిట్ కు దాదాపు 3 రూపాయలు వరకు ధర తగ్గే అవకాశం ఉందని చెబుతోంది.
-
చుక్కలు చూపిస్తున్న పవర్ కట్స్! మండుటెండల్లో అప్రకటిత కోతలు.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications