భారత్ దెబ్బకు స్పెషల్ ఫ్లైట్‌లో విదేశాలకు పారిపోయిన పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబం
భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైంది. ఈ దాడిలో 26 మందికి పైగా పర్యాటకులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే. ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం తీవ్రమైన చర్యలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య నీటి పంపకాన్ని నియంత్రించే ఈ కీలకమైన ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది.
ఇరు దేశాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గమైన అట్టారి సరిహద్దును మూసివేశారు.భారత్‌లో ఉన్న పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు, కొత్త వీసాల జారీని నిలిపివేశారు.ఇరు దేశాలు తమ దౌత్య కార్యాలయాల్లోని సిబ్బందిని తగ్గించుకున్నాయి.భారతదేశం ఈ దాడికి పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలే కారణమని ఆరోపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడికి పాల్పడిన వారిని "భూమి చివర వరకు వెంటాడి శిక్షిస్తామని" గట్టిగా హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్‌కు గట్టిగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

మరోవైపు, పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమ ప్రమేయం లేదని చెబుతోంది. అయితే, పాకిస్తాన్ కూడా ప్రతిస్పందనగా కొన్ని చర్యలు తీసుకుంది. భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు, భారత్‌తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. అంతేకాకుండా, 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేస్తే దానిని "యుద్ధ చర్య"గా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది.
మరోవైపు పాకిస్థాన్ సైతం ఇండియాకు ధీటుగానే సమాధానం ఇస్తుంది. సింధు జాలాలను నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతుంది. ఆర్మీ సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో పాకిస్థాన్ ఆర్మీ సన్నద్ధం అవుతుంది. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చని భావిస్తుంది పాకిస్థాన్.ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నారు. ఈ పరిస్థితులు దక్షిణ ఆసియా ప్రాంతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications