పాక్ పడవ పేలుడు: వివాదాస్పద ప్రకటన చేసిన కోస్ట్ గార్డ్ చీఫ్ తొలగింపు

ఢిల్లీ: పాకిస్థాన్ పడవ పేలుడు ఘటనలో ప్రభుత్వ ప్రకటన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమైన వాయువ్య ప్రాంత కోస్ట్‌గార్డు చీఫ్ ఆఫీసర్ బికె లోశాలీని ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. అదేవిధంగా అధికారిపై విచారణకు ఆదేశించింది. నూతన సంవత్సర వేడుకనాడు పాకిస్థాన్ పడవ భారత జలాల్లో పేలుడుకు గురైన విషయం తెలిసిందే.

ఇటీవల లోశాలీ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ నౌకపై దాడులు చేయాల్సింది మాకు ఆదేశాలు ఉన్నాయి. ఉన్నతస్థాయి ఆదేశానుసారమే ఆ నౌకను మేం పేల్చేశామని పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పెనుదుమారం చెలరేగింది.

Pakistan boat row: Modi govt removes Coast Guard officer Loshali

కాగా, పేలుడు పదార్థాలతో కూడిన ఓ బోటు భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిందని రక్షణ శాఖ తెలిపింది. బోటును గుర్తించిన కోస్ట్‌గార్డు అధికారులు బోటును తనిఖీ చేయడానికి సిద్ధ్దమై హెచ్చరికలను జారీచేశారు. దీంతో బోటులో ఉన్న వ్యక్తులు చేసిన చర్య కారణంగా బోటు ఒక్కసారిగా మునిగిపోతూ పేలుడుకు గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారని రక్షణశాఖ పేర్కొంది.

ప్రభుత్వం చేసిన ప్రకటన సదరు అధికారి చేసిన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో వివాదం చెలరేగింది. జరిగిన ఘటనపై వివరాలను తెలియజేస్తూ.. లోశాలీ రక్షణశాఖకు లేఖ రాశారు. వివరణపై సంతృప్తి చెందని రక్షణశాఖ వివరణను తిరస్కరించింది. జరిగిన ఆపరేషన్‌కు నేతృత్వం వహించని కారణంగా అదేవిధంగా సంఘటన స్థలంలో ప్రత్యక్షంగా లేకపోవడం వల్ల పడవ పేలుడుకు దారితీసిన కారణాలు తనకు కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+