తమ జలాల్లోకి భారత సబ్ మెరైన్ ? పాకిస్థాన్ ఆరోపణలు .. తిప్పికొట్టిన భారత్

న్యూఢిల్లీ : కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ మరోసారి పసలేని ఆరోపణలు చేసింది. తమ జలాల్లోకి భారత సబ్ మెరైన్ దూసుకొచ్చిందని అర్థంలేదని వాదన వినిపించింది. అంతేకాదు ఓ వీడియోను కూడా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. ఆ వీడియో పాతదని .. దానిని కొత్తగా చూపించే ప్రయత్నం చేసిందని పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది.

పాక్ నోట .. శాంతి మాట ...
తమ జలాల్లోకి భారత నౌకదళానికి చెందిన సబ్ మెరైన్ ప్రవేశించదని పాకిస్థాన్ ఆరోపించింది. సబ్ మెరైన్ ను చూసి, నిలిపివేసే ప్రయత్నం చేశామని ఆ దేశ నౌకాదళ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ తమ నౌకాళ సిబ్బంది రాకుండా అడ్డుకున్నారని వల్లెవేశారు. తాము ఉపఖండంలో శాంతిని కోరుకుంటున్నామని, అందుకే భారత సబ్ మెరైన్ పై దాడి చేయలేదని బిల్డప్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది. కానీ ఆ వీడియోలో సబ్ మెరైన్ నీటిలో తేలియాడుతూ కనిపించింది. నీటిపై కనిపిస్తోన్న అది సబ్ మెరైనేనా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Pakistan claims it chased away Indian Navy submarine, release video

నిరాధార ఆరోపణలు

పాకిస్థాన్ కల్పిత, కట్టుకథలను భారత్ తోసిపుచ్చింది. 2016లో వీడియోను ఎడిట్ చేసి, ఇప్పుడు వచ్చినట్టు కబుర్లు చెబుతోందని మండిపడింది. పాకిస్థాన్ విడుదల చేసిన వీడియోకు ఏ ప్రామాణికత ఉందని ప్రశ్నించింది. మూడేళ్ల కిందటి వీడియోను తేదీ, సమయం మార్చి తన వక్రబుద్దిని చూపించుకుందని విమర్శలు గుప్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+