Pakistan: హైదరాబాద్‍లో ఎంజాయ్ చేస్తున్న పాక్ జట్టు.. వైరల్ అయిన వీడియో..

ICC ODI ప్రపంచ కప్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు, 'జ్యువెల్ ఆఫ్ నిజాం'లో విందుకు వెళ్లారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బాబర్ ఆజంతో సహా పాకిస్థాన్ క్రికెటర్లు ఉన్నారు. వీరితో పాటు భద్రత సిబ్బంది కూడా ఉన్నారు. వీడియోలో బృందం హైదరాబాద్‌కు చెందిన VII నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 'జువెల్ ఆఫ్ నిజాం' వద్ద పెయింటింగ్‌ను మెచ్చుకోవడం కూడా చూడవచ్చు.

'జువెల్ ఆఫ్ నైజాం' అనేది హైదరాబాదీ వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందిన డైనింగ్ రూమ్. ఇది హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌కు చెందినది. ఆహార ప్రియులకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడానికి ప్రసిద్ధి చెందిన ఈ స్థాపనలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రెస్టారెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు విలాసవంతమైన విందును ఆస్వాదించడమే కాకుండా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

Pakistan cricket team is enjoying in Hyderabad

హైదరాబాద్‌లో పాకిస్తాన్ ODI ప్రపంచ కప్ 2023లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మొదటి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో అక్టోబర్ 6న, తర్వాత శ్రీలంకతో అక్టోబర్ 10న మ్యాచ్ జరుగుతుంది. తదనంతరం అక్టోబర్ 14న నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న భారత్‌తో మ్యాచ్ కోసం జట్టు అహ్మదాబాద్‌కు వెళుతుంది. మొన్న న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వన్ 103 పరుగులు చేయగా.. బాబర్ 80 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ 43.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రచిన్ రవీంద్ర 97 పరుగులు చేశాడు. చామ్పన్ 65 పరుగులు చేయగా.. మిచెల్ 59 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+