పెట్రోల్‌కే డబ్బులు లేవ్.. ఇక యుద్ధం చేసేంత సినిమా మా దగ్గర ఎక్కడ ఉందయ్యా..!

కాశ్మీర్‌లోని పహల్గామ్‌‌లో ఉగ్రవాదుల దాడి గురించి తెలిసిన విషయమే.ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 28 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్తా ఆర్తనాదాలుగా మారి, ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేస్తోంది.

ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ మంత్రి హెచ్చరించారు. హల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పాకిస్థాన్ సైతం ఇండియాకు ధీటుగానే సమాధానం ఇస్తుంది. సింధు జాలాలను నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతుంది. ఆర్మీ సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం.సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో పాకిస్థాన్ ఆర్మీ సన్నద్ధం అవుతుంది.

Pakistan does not have the financial capacity to wage war with India

అయితే భారత్‌తో పాకిస్థాన్ యుద్ధానికి దిగేంత సీన్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆయుధాల దగ్గర నుంచి, సైన్యం, క్షిపణిల వరకు అన్నింటిల్లోనూ పాకిస్థాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది.ముఖ్యంగా యుద్ధం చేసేంత ఆర్థిక సామార్థ్యం పాక్‌కు లేదనే చెప్పాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్లీష్టంలో ఉందనేది అక్షర సత్యం. దశాబ్దాలుగా కొనసాగుతున్న రుణ భారం, బలహీనమైన ఎగుమతులు, రాజకీయ అస్థిరత్వం దేశాన్ని ఆర్థికంగా కుంగదీశాయి. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించినా, పాకిస్తాన్ నేడు తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి సహాయం పొందినప్పటికీ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది. పన్ను వసూళ్లలో అసమర్థత, ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారింది. అక్కడి మధ్య తరగతి ప్రజలకు సరైన తిండి కూడా లభించడం లేదని తెలుస్తోంది. మోటర్ సైకిల్ ఉన్న వారికి అందులో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేని స్థితిలో పాకిస్థాన్ యువత ఉంది. అలాంటి పాకిస్థాన్ భారత్‌పై యుద్ధానికి దిగుతుందా అంటే లేదనే చెప్పాలి. ప్రస్తుతం పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తిప్పి కొట్టడానికి భారత ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+