వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కే ఎక్కువ నష్టం జరిగింది: బీఎస్ఎఫ్ ఐజీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లోని సామాన్య ప్రజలను చూసి తాము ఎప్పుడూ కాల్పులు జరపలేదని బీఎస్ఎఫ్ ఐజీ డీకే. ఉపాధ్యాయ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాక్ సైన్యం మన పౌరులను లక్షంగా చేసుకుని దాడులు చేస్తుందని ఆయన చెప్పారు.

ఎల్ వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల్లో పౌరులే లక్షంగా చేసుకుని పాకిస్థాన్ కాల్పులు జరుపుతుందని ఆయన అన్నారు. పాక్ కు దీటుగా తాము సమాధానం ఇస్తున్నామని డీకే. ఉపాధ్యాయ అన్నారు. మన పౌరులను లక్షంగా షెల్లింగ్స్ తో దాడులు చేస్తుందని ఆయన అన్నారు.

పాక్ కేవలం భారత్ సైనికులను లక్షంగా చేసుకుని దాడులు చెయ్యడం లేదని, పౌరులను లక్షంగా చేసుకుని దాడులు చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందని ఆయన ఆరోపించారు. పాక్ సైనికులను లక్షంగా చేసుకుని తాము దాడులు చేస్తున్నామని ఆయన వివరించారు.

 Pakistan forces targeted Indian civilians deliberately

తమ దాడుల్లో పాక్ సైనిక చెక్ పోస్టులు ధ్వంసం అయ్యాయని, పాక్ సైనికులు చాల నష్టపోయారని అన్నారు. పాక్ వైపు ఎక్కువగా నష్టం జరిగిందని ఇదే సమయంలో ఆయన అన్నారు. పాక్ జరిపిన కాల్పుల్లో మంగళవారం భారత్ కు చెందిన ఎనిమిది మంది మరణించారని అన్నారు.

తరువాత మేము జరిపిన ప్రతిదాడుల్లో 14 పాక్ చెక్ పోస్టులు ధ్వంసం అయ్యాయని చెప్పారు. తాము జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు మరణించారని డీకే. ఉపాధ్యాయ అన్నారు. పాక్ దాడులను తిప్పి కొట్టడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు.

English summary
Upadhyay said if there was any civilian casualty in the Pakistani side, it was because the civilian population live very close to the military bunkers that might have resulted in collateral damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X