ఇండియాను దాటేసిన పాకిస్తాన్ : ఏ విషయంలో..?
న్యూఢిల్లీ : సమవుజ్జీలకు, దాయాదులకు మధ్య పలు విషయాల్లో పోలిక ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. భారత్-పాక్ దాయాది దేశాల మధ్య కూడా ఇదే పరిస్థితి. ఒక్క క్రికెట్ లోనే కాదు, ప్రతీ విషయంలోను భారత్ తో తమను పోల్చి చూసుకునే పాక్, ఒక్క విషయంలో మాత్రం ఇండియాను అధిగమించింది.
భారత్ తో పోల్చితే నల్లధనం విషయంలో పాకిస్తానే ముందుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2014తో పోల్చితే స్విస్ బ్యాంకుల్లో పాక్ నల్లధనం 16 శాతం వరకు, అంటే రూ.10వేల కోట్ల వరకు పెరిగింది. తాజాగా గురువారం నాడు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ (ఎస్.ఎన్.బి) ఈ వివరాలను వెల్లడించింది. వరుసగా రెండో ఏడాది పాక్ నల్లధనం విలువలు పెరిగినట్టు నివేదికలో పేర్కొంది స్విస్ బ్యాంక్.

స్విస్ కరెన్సీ ప్రకారం 2014లో సీహెచ్ఎఫ్-1,301 మిలియన్లుగా ఉన్న పాక్ నల్లధనం 2015 చివరి వరకు సీహెచ్ఎఫ్-1,513 మిలియన్లకు పెరగడం గమనార్హం. ఇక భారత్ విషయానికొస్తే.. 2014తో పోల్చితే నల్లధనం విలువలు 33 శాతం పడిపోయి 2015 చివరికి ఆ మొత్తం రూ.8,392 గా ఉన్నట్టు ఎస్.ఎన్.బి తాజాగా విడుదల చేసిన జాబితా ద్వారా స్పష్టమైంది.












Click it and Unblock the Notifications