తెగబడ్డ పాక్ రేంజర్లు... సరిహద్దులో భారీ స్థాయిలో కాల్పులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మ‌రోసారి రెచ్చిపోయింది. భార‌త సైన్యం చేతిలో ఎన్నిసార్లు దెబ్బ‌తిన్నా పాక్ రేంజ‌ర్లు త‌మ బుద్ధిని మాత్రం మార్చుకోవ‌డం లేదు. మరోసారి కాల్పులకు తెగబడ్డారు.

శనివారం జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాజౌరీ మంజ‌కోటే ఎల్ఓసీ వ‌ద్ద పాక్ రేంజ‌ర్లు మరోసారి భారీస్థాయిలో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారు. పాక్ జవాన్ల కాల్పులతో సరిహద్దులో మ‌రోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

indian-soldiers

పాక్ ఆర్మీ విచక్షణా రహితంగా మోటార్ షెల్లింగ్ ల‌తో దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. అలాగే ఫూంజ్ జిల్లా బాల‌క‌కోట్ సెక్టార్‌లోనూ పాక్ రేంజ‌ర్లు కాల్పుల‌కు తెగబడ్డారు.

మ‌రోవైపు, ఈ రోజు ఉద‌యం నుంచి జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాంలో పెట్రోలింగ్ నిర్వ‌హిస్తోన్న పోలీసులు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు గ్ర‌నేడ్ దాడికి పాల్ప‌డ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Pakistani Rangers resorted to heavy firing and mortar shelling on Thursday late night) in Manjakote sector of Rajouri, Jammu and Kashmir along the Line of Control (LoC). As per reports, Pakistan targeted the forward villages and Indian Army posts in Pallanwalla, Balakote and Manjakote along the Line of Control (LoC). There were no reports of any casualties on the Indian side. A number of people these targeted villages were immediately shifted to safer locations.
Please Wait while comments are loading...